ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెట్టే రాగులు.. ఆ బెనిఫిట్స్ కూడా?

ర‌క్త‌హీన‌త‌ నేటి కాలంలో ఎంద‌రినో పీడిస్తున్న వ్యాధి ఇది.ర‌క్త హీన‌త‌నే ఎనీమియా అని కూడా అంటారు.

 Rags To Check For Anemia Even Those Benefits-TeluguStop.com

ఈ ర‌క్త హీన‌త బాధితుల్లో ఆడ‌వారు, పిల్ల‌లే అధికంగా ఉంటున్నారు.ఐర‌న్ శాతం లోపించ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

ఒళ్లంతా నొప్పులు, తీవ్ర అల‌స‌ట‌, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం పాలిపోవ‌డం, సీజ‌న్‌తో సంబంధం లేకుండా శ‌రీరం చ‌ల్ల‌బ‌డిపోవ‌డం ఇవన్నీ రక్తహీనతకు సంకేతాలు.ఇక ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది.

 Rags To Check For Anemia Even Those Benefits-ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెట్టే రాగులు.. ఆ బెనిఫిట్స్ కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ర‌క్త హీన‌త ఉన్న వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.ర‌క్త హీన‌తను త‌గ్గించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో రాగుల‌ది ప్ర‌త్యేక స్థానం.రాగుల్లో ఐర‌న్ కంటెంట్ పుష్క‌లంగా ఉంటుంది.

అందువ‌ల్ల ర‌క్త‌హీన‌త ఉన్న వారు రాగుల‌ను డైట్‌లో చేర్చుకుంటే రక్త సమృద్ది చక్కగా జరుగుతుంది.దాంతో ర‌క్త హీన‌త స‌మ‌స్య‌కు గుడ్ బై చెప్పొచ్చు.

ఇక రాగుల‌తో మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.సాధార‌ణంగా కొంద‌రు పిల్ల‌లు వ‌య‌సు పెరుగుతున్నా ఎత్తు పెర‌గ‌రు.అలాంటి పిల్ల‌ల‌కు రాగుల‌ను ఏదో ఒక రూపంలో పెట్టాలి.ఎందుకంటే, రాగుల్లో కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది.ఇది ఎముకలు బలంగా ఉంచేందుకే కాదు పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అలాగే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో తీవ్రంగా బాధ ప‌డే వారికి రాగులు బెస్ట్ అప్ష‌న్‌.

అవును, రాగులు తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, విట‌మిన్స్ ఇలా ఎన్నో పోష‌కాలు జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.అంతేకాదు, ఒత్తిడి, డిప్రెషన్, మైగ్రేన్ వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలోనూ రాగులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, ఈ స‌మ‌స్య‌లు ఉన్న వారు కూడా రాగుల‌ను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

#BenefitsFinger #Tips #Anemia #Finger Millet #Finger Millet

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube