రాహుల్ అలా చేయకపోతే.... ఏపీలో అడుగుపెట్టను.. రఘవీరా  

Raghuveera Reddy Comments-on-ap Special Status-

కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో బాగా బలపడాలని చూస్తోంది. ఇక్కడ పార్టీ ఉన్నా… లేనట్టుగానే ఉండడంతో ఏదో ఒకటి చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని తాజాగా… రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే తాను రాష్ట్రంలో అడుగుపెట్టబోనని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి ప్రకటించారు

https://telugustop.com/wp-content/uploads/2019/01/rahull-raghuvera-1.jpg

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ అయ్యాక ఏపీ ప్రత్యేక హోదా అంశంపైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు.‘రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసి తీరుతాం. అమలు చేయలేకపోతే నా జీవితంలో శాశ్వతంగా ఏపీలో అడుగుపెట్టను. నా ఊర్లో కూడా అడుగు పెట్టను. నా ఇల్లు, ఆస్తులు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. 62 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నా’ అని రఘువీరా అన్నారు. –