సక్సెస్‌ స్టోరీ : ఒకప్పుడు డెలవరీ బాయ్‌ విభిన్నమైన ఆలోచనతో ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు

కృషితో నాస్తి దుర్బిక్షం అంటారు, అంటే కృష్టితో ఏదైనా ప్రయత్నిస్తే తప్పకుండా అది సాధ్యం అవుతుంది, కష్టపడ్డప్పుడు అది ఖచ్చితంగా వృదా అవ్వదు అనేది పెద్దల మాట.ఒక సామాన్య యువకుడు తాను చేసిన చిన్న ప్రయోగం సక్సెస్‌ అవ్వడంతో పెద్దగా పెట్టుబడి లేకుండానే ఈరోజున లక్షలు సంపాదిస్తున్నాడు.

 Raghuveer Singh Choudhary Online Tea Seller In Jaipur-TeluguStop.com

ఒకప్పుడు సైకిల్‌పై తిరుగుతూ ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు నాలుగు బైక్‌లను కొనుగోలు చేసి, నలుగురికి జాబ్‌ ఇచ్చాడు.ఇతడు చేసిన పనికి అంతా కూడా అద్బుతం అంటున్నారు.

నిరుద్యోగులు ఎంతో మంది ఇతడిని చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది.ఒక విజేత గురించి తెలుసుకుంటే మనలో కూడా తెలియని శక్తి పెరుగుతుంది.

అందుకే అందుకే మీ కోసం పట్టుదలతో సక్సెస్‌ సాధించిన రఘువీర్‌ సింగ్‌ చౌదరి సక్సెస్‌ స్టోరీని తీసుకు వచ్చాను

పూర్తి వివరాల్లోకి వెళ్తే… రాజస్థాన్‌లోని జైపూర్‌లో రఘువీర్‌ సింగ్‌ చౌదరి నివాసం.కుటుంబ సభ్యులు అంతా కూడా పని చేస్తే కాని ఆ కుటుంబం నడిచే పరిస్థితి లేదు.

దాంతో రఘువీర్‌ సింగ్‌ చదువుపై ఆసక్తి ఉన్నా కూడా తక్కువ వయసులోనే చదువు వదిలేసి ఉద్యోగంలో చేరాడు.రఘువీర్‌ సింగ్‌ మొదట అమెజాన్‌ లో డెలవరీ బాయ్‌గా చేరాడు.

డెలవరీ బాయ్‌కి తప్పకుండా బైక్‌ అవసరం.కాని అతడికి బండి లేదు, అయినా కూడా అతడి పట్టుదలను చూసి అమెజాన్‌ డెలవరీ బాయ్‌ జాబ్‌ను ఇచ్చారు.

రఘువీర్‌ సైకిల్‌పై రోజుకు పది నుండి పదిహేను కిలోమీటర్లు తిరుగుతూ అమెజాన్‌ పార్శిల్స్‌ డెలవరీ ఇచ్చేవాడు.అందుకోసం అప్పుడప్పుడు తిండి కూడా మానేసేవాడు.

ఏ ప్రాంతంకు వెళ్తే అక్కడ టీ తాగి కడుపు నింపుకునేవాడు.రఘువీర్‌ వెళ్లిన కొన్ని ప్రాంతాల్లో టీ స్టాల్స్‌ లేవు.

అది గమనించిన రఘువీర్‌ ఆన్‌లైన్‌ టీ అమ్మితే బాగుంటుందనే ఆలోచన చేశాడు

అతడి ఆలోచన స్నేహితులతో చేప్పిన సమయంలో నవ్వుకున్నారు.అయితే అతడు మాత్రం ప్రయత్నిద్దాం, పోయేది ఏముంది.

పెట్టుబడి ఏం పెట్టట్లేదు కదా అనుకున్నాడు.వాట్సప్‌ ద్వారా తనకు సంబంధించిన గ్రూప్‌లో ఇంకా కొన్ని గ్రూప్‌లో ఆన్‌లైన్‌ టీ గురించి పబ్లిసిటీ చేశాడు.

కొన్ని ఏరియాల్లో టీ స్టాల్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు.మినరల్‌ వాటర్‌తో, చాలా శుబ్రమైన పరిసరాల్లో టీని తయారు చేయించి తీసుకు వస్తానంటూ రఘువీర్‌ చేసిన ప్రకటనకు చాలా మంది స్పందించారు.

చాలా ఆర్డర్లు వచ్చాయి.అమెజాన్‌లో డెలవరీ బాయ్‌గా చేస్తూనే టీ సర్వీస్‌ను చేశాడు.

కొన్ని రోజుల్లోనే మంచి డబ్బు వచ్చి బండి కొనుగోలు చేశాడు.అమెజాన్‌లో జాబ్‌ మానేశాడు.

ఆర్డర్‌లు పెద్ద ఎత్తున పెరగడంతో మరో నాలుగు బండ్లు కొని నలుగురిని ఉద్యోగంలో పెట్టుకున్నాడు.అలా ఇప్పుడు రఘువీర్‌ బిజినెస్‌ లక్షలకు చేరింది.

అతడు చేసింది చిన్న ప్రయత్నమే అయినా కూడా అద్బుతమైన విజయం సాధించింది.ఎందుకంటే అతడు ఏ పని చేసినా నమ్మకంగా చేశాడు.

నమ్మకంగా చేయడమే అతడి సక్సెస్‌ సీక్రెట్‌గా చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube