సీఎం జగన్ కు తెలుగు రాదంటూ వైసీపీ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు?

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన మరోమారు సీఎం జగన్ కు తెలుగు రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

 Mp Raghurama Krishnam Raju Sensational Comments On Jagan, Jagan, Ysrcp, Amaravat-TeluguStop.com

నిన్న ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి మీడియాతో మాట్లాడుతూ జగన్ తెలుగు భాష గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. రఘురామ ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు.

ఒక విలేకరి జగన్ గతంలో కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుందని చెప్పారని రఘురామను ప్రశ్నించగా జగన్ కు తెలుగు పెద్దగా రాదని అన్నారు.జగన్ కరోనా పోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పడానికి సహజీవనం అనే పదాన్ని ఉపయోగించారని తెలిపారు.

జగన్ లోని కవి హృదయాన్ని మీడియా అర్థం చేసుకోలేకపోయిందని అన్నారు.జగన్ కరోనాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారని కానీ కరోనాను చాలా సీరియస్ గా చూడాలని వ్యాఖ్యానించారు.

జగన్ కు ప్రతిరోజూ కోర్టు కేసులు, రాజధానిని విశాఖకు తరలించడంపైనే దృష్టి మళ్లుతోందని అందువల్ల జగన్ కరోనా మహమ్మారిపై సమీక్షలు నిర్వహించడం కూడా మానేశారని అన్నారు.జగన్ కరోనాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని వ్యాఖ్యలు చేశారు.

మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయని… ఇలాంటి సమయంలో జగన్ మాత్రం కోర్టుల్లో మొట్టికాయలు తింటూ ముందుకు వెళుతున్నారని చెప్పారు.

దేశంలోని ఏపీలో ఎక్కువగా కరోనా మహమ్మారి కేసులు నమోదవ్తున్నాయని తెలిపారు.

తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 30 నుంచి 35 కేసులు నమోదవుతున్నాయంటే వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో సులభంగానే అర్థమవుతుందని తెలిపారు.రఘురామ చేసిన వ్యాఖ్యల గురించి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube