జగన్ లో మార్పు మొదలయ్యిందిగా ? రాజు గారా మజాకా ?  

Raghuramakrishnam Raju Jagan Ysrcp - Telugu Ap Governament, Jagan, Jagan Give The Appointments, Jagan Give The Shokaj Notice, Raghu Ramakrishnam Raju, Ysrcp

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రేపుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు.ఏకంగా పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తూ, అనేక లోపాలను ఎత్తి చూపుతూ, రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అధినేత జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.

 Raghuramakrishnam Raju Jagan Ysrcp

అదేపనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు కు షోకాజ్ నోటీసులు అందించి పది రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆ నోటీసుల్లోనూ పేర్కొన్నారు.దీనిపై స్పందించిన రఘురామకృష్ణరాజు వైసీపీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజు మొదట్లో జగన్ ను ఉద్దేశించి రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, ఎమ్మెల్యేలు సమస్యలను చెప్పుకుందాము అంటే జగన్ అపాయింట్మెంట్ లభించడం లేదని, ఇద్దరు ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు తప్ప జగన్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీని దాటుకుని వెళ్లడం కష్టం అంటూ ఎన్నో సంచలన ఆరోపణలు చేశారు.

జగన్ లో మార్పు మొదలయ్యిందిగా రాజు గారా మజాకా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలాగే రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని, ఎంతో అవినీతి జరుగుతోందని, ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తారు.

తనకు జగన్ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో మీడియా ముఖంగా ఈ విషయాన్ని చెబుతున్నానని ఆయన ఎన్నో విమర్శలు చేశారు.ఈ విమర్శలను సీరియస్ గా తీసుకునే ఆయనకు షోకాజ్ నోటీసులు అందించింది.

ఇదిలా ఉంటే రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై జగన్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా అపాయింట్మెంట్ దొరకక ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన జగన్ ఇప్పుడు రోజుకు పది మంది వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇస్తున్నారట.

నియోజకవర్గ సమస్యలను, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది.అలాగే ఇసుక కొరత, ఇసుక ధరలు ఎక్కువగా ఉండటం, ప్రజల్లో దీనిపై అసంతృప్తి ఉండడం, వీటన్నిటిని గుర్తించి అనేక మార్పు చేర్పులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు రఘురామ కృష్ణంరాజు పార్టీని విమర్శించినా, ఆయన మేలు చేశారని, లేకపోతే ఈ విషయాలు ఏవి జగన్ వద్దకు వెళ్లి ఉండేవి కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raghuramakrishnam Raju Jagan Ysrcp Related Telugu News,Photos/Pics,Images..

footer-test