రాజకీయ భవిష్యత్ కష్టమేనా రాజు గారు ? 

వరుస వివాదాలతో గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లోనే కాకుండా, ఢిల్లీలోనూ రాజకీయ సెగలు పుట్టిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.ఇటీవలే అరెస్ట్ అయిన ఆయన జైలుకు వెళ్లడం , అక్కడి నుంచి ఆర్మీ ఆసుపత్రిలో చేరడం,  ఆ తర్వాత బెయిల్ లభించడంతో ఢిల్లీ కి వెళ్ళిపోయారు.

 Raghurama Krishnaraja Politics Raghurama Krishnarajas Political Future Is In Tro-TeluguStop.com

ఇక కోర్టు ద్వారానే జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండడంతో పాటు,  సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనల ప్రకారం ఆయన మీడియా,  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ వ్యవహారాలన్నీ ముగిసిన తర్వాత రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

ఎలాగూ వైసీపీకి ఆయన దూరమయ్యారు కాబట్టి , ఆయన టిడిపి , బిజెపి లలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో టిడిపి యాక్టివ్ గా ఉంటోది.అయితే రఘురామకృష్ణంరాజు ద్వారానే టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.అదే కనుక జరిగితే నరసాపురం నుంచి బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఆయనే ఉంటారు అనే టాక్ మొదలయ్యింది.ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.ఈ సమయంలో బిజెపి మిత్రపక్షాలు ఒక్కొక్కరు దూరం అవుతూ ఉండడంతో పాటు,  ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కనిపించలేదు.

ప్రాంతీయ పార్టీల హవా నడిచింది.ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క రఘురామకృష్ణంరాజు కోసం జగన్ తో విభేదాలు పెట్టుకునేందుకు బీజేపీ సాహసం చేయదు.

అంతేకాదు మళ్లీ 2024 తరువాత జగన్ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu Chandrababu, Jagan, Modhi, Mpraghurama, Sapuram, Ysrcp-Telugu Political N

 దీంతో తప్పనిసరిగా ఎన్డీఏ కి జగన్ మద్దతు అవసరం అవుతుంది.కానీ ఇప్పుడు రఘు రామ క్రిష్ణం రాజు కోసం జగన్ స్నేహాన్ని వదులుకునేందుకు బిజెపి ఏ మాత్రం ఇష్ట పడదు.ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో బిజెపి సైతం రఘురామకృష్ణంరాజు కు టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు.

ఈ మేరకు జగన్ సైతం బీజేపీపై ఒత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు.ఏ లెక్కల్లో చూసుకున్నా రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడినట్టే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube