ప‌ద‌వి ముప్పు నుంచి బ‌య‌ట ప‌డ్డ ర‌ఘురామ‌.. ఎలాగంటే..?

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజు విష‌యంలో ఎన్నో మ‌లుపులు చోటుచేసుకుంటున్నాయి.ఆయ‌న్ను ఎలాగైనా ప‌ద‌వి నుంచి అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెయ్య‌ని ప్ర‌య‌త్నం లేదు.

 Raghurama Krishnam Raju Who Get Rid Of Threat To Mp Post By Supreme Court Judgem-TeluguStop.com

ఇప్ప‌టికే ఆయ‌న్ను అన‌ర్హ‌త వేటు వేసి ప‌ద‌వి నుంచి తొలగించాల‌ని లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.అయితే ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కావాల‌నే లేట్ చేస్తోంది.

దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా స్పీక‌ర్ పెండింగ్‌లో పెడుతున్నారు.

ఇక స్పీక‌ర్ ద‌గ్గ‌ర కుప్ప‌ల కొద్దీ అప్లికేష‌న్లు పెండింగ్‌లో ఉండంటంపై వేసిన ఓ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ర‌ఘురామ‌కు క‌లిసొచ్చేలాగా ఉంది.

లోక్ సభతో పాటు చట్ట సభల స్పీకర్ల పాత్రపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.చాలామంది ఎంపీల‌పై వేస్తున్న అన‌ర్హత ఫిర్యాదులపై లోక్ స‌భ స్పీకర్ కు మాత్ర‌మే ప్రజాప్రాతినిధ్య చట్టం ఉందని స్ప‌ష్టం చేసింది.

ఆ చ‌ట్టం ప్ర‌కారం స్పీకర్లకే సర్వాధికారాలు ఉన్నాయ‌ని, కాబ‌ట్టి అలాంటి విష‌యాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ తీర్పు ఇచ్చింది.

Telugu Ap Ycp, Jagan, Mp Raghurama, Om Birla, Supreme, Threat Mp, Ycp Rebel Mp-T

అనర్హతల అప్లికేష‌న్ల‌పై స్పీక‌ర్ తీసుకున్న నిర్ణయమే ఫైన‌ల్ అవుతుంద‌ని, కాబ‌ట్టి ఇందులో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ తెలిపింది.అయితే ఈ విష‌య‌మే ఇప్పుడు ర‌ఘురామ‌కు ప్ల‌స్ అయ్యేలాగా క‌నిపిస్తోంది.ఎలా అంటే స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునే వర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా ఎలాంటి ముంద‌డుగు వేయ‌లేదు.

కానీ స్పీక‌ర్ మాత్రం కేంద్ర ఆదేశాల మేర‌కు ర‌ఘురామ‌కు అండ‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.ఇప్ప‌టికే ర‌ఘురామ‌కు అన్ని విష‌యాల్లో అండ‌గా ఉంటున్న బీజేపీ అనర్హ‌త విష‌యంలో కూడా అండ‌గా ఉండే అవ‌కాశం ఉంది.

కాబట్టి ఆయ‌న ప‌ద‌వికి ఎలాంటి గండం లేద‌నే చెప్పాలి.ఈ తీర్పు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube