ఇటీవల గత కొన్ని రోజుల నుండి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసపెట్టి వైయస్ జగన్ కి లెటర్లు రాసిన సంగతి తెలిసిందే.ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కొన్నిటిని అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టినట్లు వాటిని వెంటనే అమలు చేయాలని .
లెటర్లు రాస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి గురించి జగన్ కి రఘురామకృష్ణంరాజు లెటర్ రాశారు.
కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాన్సాస్, సింహాచలం దేవస్థానాల ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజు పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేయడం జరిగింది.
అశోక్ గజపతిరాజు పై ఒక దొంగ ఫోర్జరీ కేసు .ట్రస్ట్ భూములను అన్యాయంగా విక్రయించు కొన్నాడు.ఖచ్చితంగా త్వరలో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం, చైర్మన్ పదవి నుండి తొలగిపోవడం గ్యారెంటీ అంటూ అనేక ఆరోపణలు కామెంట్లు చేయడం జరిగింది.దీంతో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ కి రఘురామకృష్ణంరాజు తాజాగా లెటర్ రాశారు.
న్యాయస్థానంలో చట్టబద్ధంగా గెలిచిన అశోక్ గజపతిరాజు విషయంలో విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరేలా ఉన్నాయి అంటూ జగన్ కి లెటర్ రాశారు.విజయసాయిరెడ్డి నోరుని కంట్రోల్ లో పెట్టాలని.లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో 2014 ఎన్నికల టైంలో సంభవించిన పరిస్థితులు మళ్లీ భవిష్యత్తులో పునరుత్పత్తి అయ్యే అవకాశం ఉందని వెంటనే విజయసాయిరెడ్డిని మరికొంత మంది నాయకులను నియంత్రించాల్సిన అవసరం ఉందని జగన్ కి రఘురామకష్ణంరాజు సూచించారు.