హత్యకు కుట్రంటూ... లేఖలో కేసిఆర్ కు బాధ చెప్పుకున్న రఘురామ

ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు సంబంధించిన వ్యవహారం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గానే మారింది.భీమవరంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోది సభకు స్థానిక ఎంపీ హోదాలో హాజరయ్యేందుకు ప్రయత్నించిన రఘురామ ను ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో రఘురామ ప్రయాణాన్ని మధ్యలోనే వాయిదా వేసుకున్నారు.

 Raghurama Expressed His Grief To Kcr In The Letter , Mp Raghurama Krishnam Raju,-TeluguStop.com

దీనిపై అప్పటి నుంచి ఏపీలో రచ్చ జరుగుతూనే ఉంది.ఇప్పుడు దానికి సంబంధించిన వ్యవహారంపై తెలంగాణలోనూ అదే రకమైన రచ్చ మొదలైంది.

రఘురామ నివాసం సమీపంలో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ సంచరించడం దానిని గమనించి రఘురామ భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకుని దౌర్జన్యం చేయడం, పోలీసులకు అప్పగించడం వంటివి జరిగాయి అయితే తనపై రఘురామ , ఆయన కుమారుడు రఘురామ పిఏ , రఘురామ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఐదుగురిపై కేసు నమోదు చేశారు.  ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కు రఘురామ లేఖ రాశారు.
  తన కుటుంబాన్ని , తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని అందుకోసమే హైదరాబాద్ ఎంఆర్ బౌల్డర్ హిల్స్ లోని తన నివాసం సమీపంలో  రెక్కీలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు.జులై 4 తన ఇంటి సమీపంలో కొందరు రెక్కీ నిర్వహిస్తుండగా అందులో ఒకరిని సిఆర్పిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని అతడిని ప్రశ్నిస్తే ఏపీ ఇంటిలిజెన్స్ కు చెందిన వ్యక్తినని తన పేరు భాష అని చెప్పినట్లు రఘురామా లేఖలు ప్రస్తావించారు.
 

Telugu Delhi, Hyderabad, Intigence, Modhi Bimavaram, Modhi, Mpraghurama, Stefen

ఐడి కార్డు అడిగితే చూపించలేదని,  ఉన్నతాధికారుల వివరాలు కూడా చెప్పలేదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అతడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని,  కానీ ఏపీ పోలీసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మద్దతు ఇస్తూ,  నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రఘురామ లేఖలో ప్రస్తావించారు.ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుని తెలంగాణలో శాంతిభద్రతలు రక్షించాలని లేఖలో కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube