అన‌వ‌స‌రంగా అలాంటి కామెంట్లు చేస్తున్న ర‌ఘురామ‌.. ఆడేసుకుంటున్న వైసీపీ

వైసీపీలో ఉన్న‌ప్పుడే ఏపీ సీఎం జగన్ బెయిల్ ను ఎలాగైనా స‌రే రద్దు చేయాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై వైసీపీ తీవ్ర ఆగ్ర‌హంగా ఉంది.

 Raghuram Making Such Comments Unnecessarily Ycp Commanding, Raghurama, Ycp-TeluguStop.com

కాగా ఎన్నో రోజుల నుంచి ఉత్కంఠ‌గా సాగిన విచార‌ణ చివ‌ర‌కు ముగిసింది.సీబీఐ కోర్టులో విచార‌ణ సంద‌ర్భంగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిష‌న్ అంత క‌రెక్టుగా లేద‌ని, దాన్ని కోర్టు కొట్టేసింది.

దీంతో రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు పెద్ద షాక్ తగిలింది.ఇక ఈ షాక్‌తో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న్ను ఇర‌కాటంలో ప‌డేశాయి.

ఆయ‌న కొంచెం వ్యంగ్యంగా దీనిపై స్పందించ‌డంతో అది కాస్తా న్యాయస్థానాలను ర‌ఘురామ అగౌరవ‌పరిచారంటూ వైసీపీ విమ‌ర్శిస్తోంది.రీసెంట్ గా దీనిపై సాక్షి వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌నే ఇప్పుడు సీబీఐ కోర్టులో నిజమని తేలిందంటూ ర‌ఘురామ వ్యాఖ్యానించారు.

ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటంటే బెయిల్ రద్దు పిటీషన్ పై కోర్టు కంటే ముందే సాక్షి వెబ్ మీడియాలో ఓ కథనం వ‌చ్చింది అందులో పిటిష‌న్‌ను రద్దు చేయకముందే చేసిన‌ట్టు వార్త రావ‌డంతో అది కాస్తా దుమారం రేపింది.ఇక దీన్ని ఆపాదిస్తూ అదే నిజ‌మైందంటూ ర‌ఘురామ తెలిపారు.

Telugu Ap, Cbi, Cm Jagan, Raghurama, Sakshi Paper-Telugu Political News

ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో ర‌ఘురామ న్యాయస్థానాల మీద ప్ర‌జ‌ల‌కు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాడని వైసీపీ ఎంపీలు, ఇత‌ర నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఇక సోష‌ల్ మీడియాలో కూడా దీనిపై బాగానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.మీకు కూడా బెయిల్ కూడా వ‌చ్చింది క‌దా అప్పుడెందుకు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదంటూ అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు.త‌న‌కు జ‌రిగితే కోర్టు గొప్ప‌వి, ఇత‌రుల‌కు బెయిల్ వ‌స్తే అది మంచిది కాదని ఎలా హితవు పలుకుతున్నారంటూ వైసీపీ ఆయ‌న్ను విమ‌ర్శిస్తోంది.

దీంతో ఆయ‌న ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube