బీజేపీ కాదు టీడీపీ ! రాజు గారు డిసైడ్ అయినట్టేనా ? 

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంతరంగం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.సొంతపార్టీ పైన తిరుగు జెండా ఎగరవేయడం, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ, గత కొంతకాలంగా ఆయన విమర్శలు వైసీపీకి పెద్ద చికాకు కలిగించాయి.

 Raghuram Krishnaraja Is Of The Opinion That It Would Be Better To Join Tdp Than-TeluguStop.com

టిడిపి, జనసేన, బిజెపి నాయకులు చేసిన విమర్శలు పెద్దగా జనాల్లోకి వెళ్లలేదని, కానీ సొంత పార్టీ ఎంపీ రచ్చబండ పేరుతో ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపించడమే కాకుండా, ప్రతి విషయంపైనా స్పందిస్తూ, జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వానికి తెచ్చిన ఇబ్బందులు అన్నిటినీ భరిస్తూ భరిస్తూ చివరకు ఆయనను సిఐడి పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించింది.ఆ తర్వాత అనేక పరిణామాల మధ్య ఆయనకు బెయిల్ లభించి ఢిల్లీకి చేరిపోయారు.

Telugu Chandrababu, Delhi, Jagan, Mpraghurama, Sapuram, Sapuram Mp, Ysrcp-Telugu

ఇక బీజేపీ అప్పటి నుంచి బీజేపీ పెద్దలను కలుస్తూ, వైసీపీ ప్రభుత్వం పై అనేక ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు.కేంద్ర మంత్రులు ఒక్కొక్కరిని కలుస్తూ ,తన అరెస్టు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ, కాక రేపే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరతారని అంతా అభిప్రాయపడ్డారు.అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం బిజెపి కంటే తెలుగుదేశం పార్టీనే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చేశరట .దీనికి కారణం తన అరెస్టు సమయంలో తనకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తుంది అనుకున్న బిజెపి అనుకున్న రేంజ్ లో రియాక్ట్ కాకపోవడం,  పరోక్షంగా జగన్ ప్రభుత్వానికి సహకరించడం తన అరెస్టు విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు అంతంత మాత్రంగా స్పందించడం వంటి వ్యవహారాలు అన్నిటినీ ఆయన ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారట.

Telugu Chandrababu, Delhi, Jagan, Mpraghurama, Sapuram, Sapuram Mp, Ysrcp-Telugu

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ చాలా పాజిటివ్  స్పందించిందని, తన అరెస్టు జరిగిన వెంటనే లాయర్లను ఏర్పాటు చేయడంతో పాటు, తనకు మద్దతుగా టిడిపి నాయకులు అంతా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఏపీ నుంచి ఢిల్లీ వరకు అన్ని విషయాల్లోనూ టిడిపి తనకు అండగా నిలబడటం వంటి విషయాలను ఆయన గుర్తు చేసుకుంటున్నారట.అందుకే బిజెపిలోకి వెళ్లే కంటే రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున నర్సాపురం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రఘురామ కృష్ణంరాజు మీద ఉన్న బ్యాంకు కేసులు తదితర విషయాల్లో బిజెపి సహకారం తప్పనిసరి.

అందుకే ఆ పార్టీ లోకి వెళ్దాము అని అనుకున్నా, బిజెపి కంటే టిడిపినే బెటర్ అన్న ఆలోచనలో ఆయన ఉన్నారట.రాబోయే ఎన్నికల వరకు వైసీపీ లోనే ఉంటూ,  ఆ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా రఘురామ కృష్ణంరాజు పనిచేయబోతున్నట్టు గా అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube