రాజు గారి ఢిల్లీ రాజకీయం ? జగన్ కు చిక్కులు తప్పవా ?

రాజద్రోహం కేసులో అరెస్టయిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు బెయిల్ లభించినా కొద్ది రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు.మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉంటారనే ప్రచారం జరిగినా, ఆయన అకస్మాత్తుగా డిశ్చార్జ్ కావడం వంటివి జరిగిపోయాయి.

 Raghuram Krishna Who Went To Delhi Was In Trouble Except For The Ap Government M-TeluguStop.com

బెయిల్ లభించిన వెంటనే రఘురామకృష్ణరాజు ఢిల్లీ కి ప్రత్యేక విమానంలో వెళ్ళారు.ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలు చేయించుకుని , కొన్ని రోజులపాటు అక్కడే చికిత్స పొందాలి  అని నిర్ణయించుకున్నారు.

అయితే ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన అకస్మాత్తుగా డిశ్చార్జ్ అయ్యేందుకు లేఖ రాయడం వంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.

కాకపోతే ఆయన అత్యవసరంగా ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందడం వెనుక రాజకీయం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆయన హైదరాబాద్ లోనే ఉంటే ఏపీ సిఐడి పోలీస్ ల నుంచి ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం జరుగుతుండగా, అసలు కారణం వేరే ఉందని, ఆయన ఢిల్లీ నుంచి రాజకీయ చక్రం తిప్పే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారితో సన్నిహితంగా మెలిగేందుకు,   వారి ద్వారా తనకు ఏర్పడిన ఇబ్బందుల నుంచి బయట పడేందుకు , జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బిజెపి పెద్దలతో వ్యూహరచన చేయబోతున్నట్లు గా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Telugu Amithsha, Delhi, Modhi, Mpragurama, Ragurama, Ysrcp-Telugu Political News

 ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత , ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా తో భేటీ అవుతారని, తన కేసుల విషయంతోపాటు, ఏపీ రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆయన వారితో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనల ప్రకారం మీడియాతో కానీ,  సోషల్ మీడియా ద్వారా గాని ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి అవకాశం లేకుండా పోవడంతో, ఢిల్లీ పెద్దల ద్వారానే రాజకీయం చేయాలని, ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వం పై తాను పై సాధించాలనే లక్ష్యంతో రఘురామకృష్ణంరాజు ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఇంత ఆకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి వెళ్ళిరనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube