ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
ఎక్కడికక్కడ గ్రామాలలో గుంతలు కలిగిన రోడ్లు దర్శనమివ్వడంతో మరికొన్ని చోట్ల.ఎక్కడికక్కడ వర్షపునీరు ఆగిపోవటంతో.
జనాలు రోడ్లపై పడిపోయి కాళ్లు చేతులు కొట్టుకుంటున్న పరిస్థితి ఏపీలో నెలకొంది.భయంకరంగా ఏపీలో రహదారులు.
మృత్యు మార్గాలుగా తయారయ్యాయి.ఇటువంటి తరుణంలో రోజుకొక లెటర్ తో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు.
ఈరోజు తాజాగా మరోసారి “నవ సూచనలు” హెడ్డింగ్ తో కూడిన లెటర్ రాయడం జరిగింది.
రాష్ట్రంలో రోడ్డు పనులను గురించి విమర్శలు చేస్తూ.
వ్యంగ్యంగా ప్రశ్నించారు.ఏపీలో రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయి అని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మరమ్మతు పనులు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్రంలో అనేక చోట్ల గుంతలు కలిగిన రోడ్డు దర్శనమిస్తున్నాయి అని అదే రీతిలో కరెంట్ స్తంభాలను పట్టుకుంటే షాక్ ఇచ్చినట్లు.
రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

బ్రతకడమే కష్టం అని అనుకుంటున్న ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద కూడా బతుకు బండి లాగడం మరింత కష్టతరంగా మారింది అని, రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అంటూ వెంటనే ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులపై దృష్టి పెట్టాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
