దడ పుట్టిస్తూనే ఉన్న రఘురామ ! ఆ సీక్రెట్స్ చెప్పేది ఎవరు ? 

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వానికి దడ పుట్టిస్తూనే ఉన్నారు.నిత్యం జగన్ కు కంటిలో నలుసుగా ఆయన మారారు.

 Raghuram Krishna Raju Is A Frequent Critic Of The Ap Government-TeluguStop.com

ప్రతి అంశం పైన రఘురామ స్పందిస్తున్నారు.ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు .అసలు ప్రభుత్వం విధివిధానాలు ఏమిటనేది కూడా ఆయన తరచుగా చెబుతున్నారు.ఢిల్లీ నుంచే ఆయన తన విమర్శలను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

ఏపీలో నెలకున్న చిన్న చిన్న సమస్యల నుంచి మొదలుకుని, జగన్ విజయసాయిరెడ్డి వంటివారి వ్యవహారాల పైన స్పందిస్తున్నారు.వైసిపి ముందు ముందు ఏవిధంగా వ్యవహరించాబోతోందో అనే విషయాలను సైతం ఆయన చెప్పేస్తున్నారు.

 Raghuram Krishna Raju Is A Frequent Critic Of The Ap Government-దడ పుట్టిస్తూనే ఉన్న రఘురామ ఆ సీక్రెట్స్ చెప్పేది ఎవరు  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లో ఉన్న లొసుగులను బయటపెట్టేస్తున్నారు.అసలు రఘురామ కు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్యమైన అంశాలు ఏ విధంగా తెలుస్తున్నాయి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

కాకపోతే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై వైసీపీ పై విమర్శలు చేస్తున్నా, జనాల్లోకి వెళ్లడం లేదు అనే ఆలోచనతోనే కొన్ని రహస్యాలను చేరవేస్తున్నారు అని, వాటి ఆధారంగానే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయగలుగుతున్నారు అనే అనుమానాలు లేకపోలేదు.ప్రస్తుతం విశాఖ లో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై ఆయన దృష్టి పెట్టారు.

అక్కడ పెద్దఎత్తున భూకబ్జాలు, అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని రఘురామ  చెబుతున్నారు.
   అసలు వైసిపి తీసుకుంటున్న కొన్ని కొన్ని అత్యంత రహస్యమైన విషయాలు వంటి వారికి చేరి పోతుండడంతో వైసిపి లోను కొంతమంది రఘురామ కు రహస్యాలను వేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.

ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ ని లీడ్ చేస్తున్న విజయసాయిరెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ నాయకులలోనూ అసంతృప్తి ఉంది.ముఖ్యంగా విశాఖ జిల్లాలో విజయసాయిరెడ్డి పై గుర్రుగా ఉన్న కొంతమంది నేతలు ప్రభుత్వానికి సంబంధించిన రహస్య విషయాలు రఘురామ కి చేరవేస్తున్నారు అని, అందుకే ఆయన ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాల పై స్పందించగలుగుతున్నారు.

విజయసాయి రెడ్డి వంటివారు భూకబ్జాలకు పాల్పడ్డారని ,ఎన్నో అవినీతి వ్యవహారాలు చేస్తున్నారని , తన వద్ద ఆధారాలు ఉన్నాయని రఘురామ చెబుతూ ఉంఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
 

Telugu Ap Cm Jagan, Chandrababu, Media, Rachhabanda, Sajjala Ramakrishna Reddy, Tdp, Vijay Sai Reddy, Vizag Land Issues-Telugu Political News

  వైసీపీ ప్రభుత్వం వేగంగా స్పందించాలి అంటే రఘురామ వంటి వారితో పదేపదే ఆయా అంశాల పై విమర్శలు చేస్తే కానీ ,పని జరగడం లేదన్న భావన ప్రతిపక్షాలతో పాటు, వైసీపీలోనే అసంతృప్త నేతలలోను ఉంది.అందుకే రఘు రామ కు ఏపీలో ఈ స్థాయిలో ప్రాధాన్యం పెరిగినట్టుగా కనిపిస్తోంది.

#Vizag #Rachhabanda #Chandrababu #Vijay Sai Reddy #AP CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు