వైసీపీ ఎంపీ పై ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు..!!

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి ఫిర్యాదు చేయడం జరిగింది.వైయస్ జగన్ కి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తే అంతు చూస్తానంటూ పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీ గోరంట్ల మాధవ్ తనని బెదిరించినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు.

 Ycp Raghuram Krishna Raju Complains Against Ycp Mp-TeluguStop.com

ఈ విషయాన్ని ఢిల్లీ లో మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు.పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలందరూ ముందు తనపై గోరంట్ల మాధవ్ దుర్భాషలాడరని స్పష్టం చేశారు.

అదే సమయంలో బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఉన్నారని.తాను ఆ టైంలో సమయం పాటించినట్లు, తర్వాత లోక్సభ స్పీకర్ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

 Ycp Raghuram Krishna Raju Complains Against Ycp Mp-వైసీపీ ఎంపీ పై ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత మాత్రమే కాక తనను ఎదిరించిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ సెంట్రల్ హాల్ సీసీ కెమెరాల్లో ఉన్నట్లు స్పష్టం చేశారు.సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే గోరంట్ల మాధవ్ హావభావాలు ఏంటో ఇట్టే అర్థమై పోతాయి అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

కావాలని గోరంట్ల మాధవ్ తో జగన్.మాట్లాడిన చాడా లేకపోతే జగన్ ని మంచిగా చేసుకోవడానికి ఆయన మాట్లాడారో తెలియలేదని రఘురామకృష్ణంరాజు మీడియా ముఖంగా తెలిపారు.

ఈ విషయంలో స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారని, అక్కడ న్యాయం జరగకపోతే ప్రధాని మోడీ కి ఫిర్యాదు చేస్తానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

#PM Modi #Anatapuram #Gorantla Madhav #Lok Sabha #Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు