టీడీపీ నేత‌కు మ‌ద్ద‌తుగా ర‌ఘురామ‌.. అర్థంకాని ఎంపీ పాలిటిక్స్‌!

గ‌త కొద్ది రోజులుగా ఏపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది.ఆయ‌న ఎప్పుడు ఎవ‌రికి మ‌ద్దతు ఇస్తారో లేదా ఏ పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డ‌తారో అర్థం కాకుండా ఉంది.

 Raghuram In Support Of Tdp Leader Meaningless Mp Politics-TeluguStop.com

ఇక వైసీపీపై మొన్న‌టి వ‌ర‌కు ఒంటి కాలిపై లేచిన ఈ రెబ‌ల్ ఎంపీ.వ‌రుస‌గా కేంద్ర పెద్ద‌ల‌కు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేశారు.

ఇంకోవైపు త‌న తోటి ఎంపీల‌కు లేఖ‌లు రాసి జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త తీసుకొచ్చారు.

 Raghuram In Support Of Tdp Leader Meaningless Mp Politics-టీడీపీ నేత‌కు మ‌ద్ద‌తుగా ర‌ఘురామ‌.. అర్థంకాని ఎంపీ పాలిటిక్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆయ‌న‌కు కేంద్ర బీజేపీ స‌పోర్టు ఉంద‌నే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.

కానీ ఆయ‌న బీజేపీ మ‌ద్ద‌తుదారున‌ని మాత్రం డిక్లేర్ చేయ‌కుండా రాజ‌కీయాలు చేస్తున్నారు.ఇంకోవైపు వైసీపీపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఈ మ‌ధ్య కాస్త త‌గ్గించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.అయితే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ర‌ఘురామకు వ‌రుస షాక్‌లు ఇవ్వ‌డంతో ఈ రెబ‌ల్ ఎంపీ కాస్త త‌గ్గిన‌ట్టు అనిపించింది.కాగా లేటెస్టుగా ఆయ‌న ఓ టీడీపీ కీల‌క నేత‌కు స‌పోర్టుగా నిలిచారు.

Telugu Ap And Ycp, Arrested Mp Raghurama Krishnam Raju-Telugu Political News

ఇక ఈయ‌న స‌పోర్టుగా నిలిచిన వ్య‌క్తి కూడా ఈయ‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తే కావ‌డం గ‌మ‌నార్హం.గ‌త కొద్ది కాలంగా రాజకుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన టీడీపీ కీల‌క నేత అశోక్ గజపతిరాజుపై వైసీపీలో నెంబ‌ర్ 2గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై తాజాగా ఎంపీ ర‌ఘురామ యాక్ష‌న్‌లోకి దిగారు.ఏకంగా సీఎం జ‌గన్‌కే లేఖ రాసి ట్విస్టు ఇచ్చారు.విజ‌య‌సాయి రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవ‌ని, గ‌జ‌ప‌తిరాజుపై చేస్తున్న ఆరోప‌ణ‌ల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుంద‌ని సూచించారు.అయితే ఇక్క‌డే ఆయ‌న మార్కు అర్థం కాకుండా ఉంది.

ఆయ‌న టీడీపీకి స‌పోర్టు చేస్తున్నారా లేక త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కాబ‌ట్టి అశోక్‌కు మ‌ద్ద‌తిస్తున్నారా లేక వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది.

#AP And YCP #ArrestedMp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు