మిలటరీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కానున్న రఘురామకృష్ణంరాజు..!!

సుప్రీంకోర్టు నిన్న రఘురామకృష్ణంరాజు కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే.దీంతో నేడు ట్రయల్ కోర్టు లో లక్ష రూపాయలు వ్యక్తిగత బాండ్ చెల్లించటమే కాక ఇద్దరు పూచీకత్తులు రఘురామ కృష్ణంరాజు తరపు లాయర్లు సమర్పించనున్నారు.

 Raghu Rama Krishnam Raju Dishcharged From Military Hospital Suprem Court, Raghu-TeluguStop.com

సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ మిలటరీ హాస్పిటల్ కి చేరటంతో రఘురామకృష్ణంరాజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కానున్నారు.ఇదిలా ఉంటే బెయిల్ పై  బయటకు వచ్చాక యధావిధిగా సీఐడీ విచారణకు సహకరించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది.

అదే రీతిలో విచారణకు 24 గంటల ముందు నోటీసులు అందజేయాలని పోలీసులకు తెలియజేసింది.

ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడకూడదని, గతంలో మాదిరిగా గాయాల చూపించకూడదని రఘురామ కృష్ణంరాజు కి తెలియజేసింది.

ఏ మాత్రం కోర్టు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది.కాగా దాదాపు ఈ తతంగం మొత్తం ముగిసి హాస్పిటల్ నుండి రఘురామకృష్ణంరాజు ఇంటికి వెళ్ళడానికి మధ్యాహ్నం పడుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనా రఘురామకృష్ణం రాజు కి బెయిల్ రావటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube