వకీల్ సాబ్ ని చుసిన తరువాత గుండె బరువెక్కిందంటున్న ప్రముఖ సింగర్...

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఈనెల 9వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ చిత్రంలో శృతి హాసన్, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Raghu Kunche Shared His Views About Vakeel Saab-TeluguStop.com

అయితే ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన “పింక్” చిత్రానికి రీమేక్ అయినప్పటికీ రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టి బాక్సాఫీస్ ని షేక్ చేసింది.దీంతో ఇప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సినీ సెలబ్రిటీలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ రఘు కుంచె కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా “వకీల్ సాబ్” చిత్రంపై స్పందించాడు.ఇందులో భాగంగా వకీల్ సాబ్ చిత్రాన్ని చూసిన తర్వాత తన గుండె బరువెక్కిందని అంతేకాక ఈ చిత్రంలోని సన్నివేశాలను చూస్తూ ఎన్ని సార్లు చప్పట్లు కొట్టానో తనకే తెలియదని పేర్కొన్నాడు… అంతేకాకుండా సమాజంలో ఒక మామూలు ఆడపిల్లకి అఘాయిత్యం జరిగితే సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడం, టీవీల్లో డిబేట్లు పెట్టడం, అలాగే కొవ్వొత్తులతో సంఘీభావం తెలపడం లాంటివి చేస్తూ ఒక వారం రోజులు హడావిడి చేసి మళ్లీ పట్టించుకోరని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 Raghu Kunche Shared His Views About Vakeel Saab-వకీల్ సాబ్ ని చూసిన తరువాత గుండె బరువెక్కిందంటున్న ప్రముఖ సింగర్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో వకీల్ సాబ్  చిత్రంపై రఘు కుంచె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను రఘు కుంచె స్పష్టంగా తెలియజేశాడని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా భారీ అంచనాల నడుమ విడుదలైన “వకీల్ సాబ్” చిత్రం అనుకున్న విధంగానే ప్రేక్షకుల అంచనాలను అందుకుంది.దీంతో విడుదలైన మొదటిరోజే దాదాపుగా 55 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

దీంతో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది.కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగులో హరహర వీరమల్లు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్ పోస్టర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.

#Raghu Kunche #Pawan Kalyan #Vakeel Saab #RaghuKunche

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు