నేను చేసిన సినిమాలను లాక్కున్నాడు  

Raghu Kunche Comments On Music Director-raghu Director,raghu Kunche

బుల్లి తెరపై యాంకర్‌గా సింగర్‌గా సంగీత దర్శకుడిగా నటుడిగా ఎన్నో రకాలుగా గుర్తింపు దక్కించుకున్న రఘు కుంచె ప్రస్తుతం ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం సంగీత దర్శకుడిగా తనకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందనే నమ్మకంను రఘు కుంచె వ్యక్తం చేస్తున్నాడు.తన కెరీర్‌లో ఎన్నో మంచి ఆఫర్లు వచ్చినా కూడా కొన్ని సార్లు కొందరు నన్ను మోసం చేయడంతో పాటు నన్ను తొక్కేసే ప్రయత్నం చేశారంటూ తీవ్ర స్థాయిలో రఘు కుంచె కొందరు సంగీత దర్శకులపై విరుచుకు పడ్డాడు.

Raghu Kunche Comments On Music Director-raghu Director,raghu Kunche Telugu Tollywood Movie Cinema Film Latest News Raghu Kunche Comments On Music Director-raghu Director Raghu-Raghu Kunche Comments On Music Director-Raghu Director

రఘు కుంచె మాట్లాడుతూ నేను గతంలో రెండు సినిమాలకు సంగీత దర్శకత్వం చేశాను.

కాని అవి చివర్లో కొందరు నా నుండి లాగేసుకుని రీ రికార్డింగ్‌ చేశారు.నాకు పేరు రాకుండా చేయడంతో పాటు నాకు అవకాశాలు కూడా లేకుండా చేశారంటూ రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఈ సందర్బంగా రఘు కుంచె ఒక దర్శకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.అతడి వల్ల నేను ఇబ్బందులు పడ్డట్లుగా చెప్పుకొచ్చాడు.

అయితే ఆ సంగీత దర్శకుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం రఘు కుంచె చెప్పలేదు.అయితే ఆ సంగీత దర్శకుడు చక్రి అయ్యి ఉంటాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.