భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాఘవేంద్ర రావు  

Raghavendra Rao Resigned To The Ttd Bhakthi Channel Chairman Post-chairman,raghavendra Rao,tdp,ttd,ttd Bhakthi,టీడీపీ,రాఘవేంద్ర రావు

రాష్ట్రంలో అధికారం చేతులు మారుతున్న నేపథ్యంలో ఒక్కొక్క మార్పు చోటుచేసుకుంటుంది. ఇప్పటివరకు ఉన్న టీడీపీ పార్టీ ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు గారు కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం..

భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాఘవేంద్ర రావు -Raghavendra Rao Resigned To The TTD Bhakthi Channel Chairman Post

టీడీపీ హయాంలోశ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి పాలవ్వడం తో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత తప్పకుండా మార్పులు చోటుచేసుకుంటాయి అన్న నేపథ్యంలో ముందుగానే ఊహించన రాఘవేంద్ర రావు తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. అయితే తాను పదవికి రాజీనామా చేయటానికి కారణం వయోభారంగా ఆయన పేర్కొనటం విశేషం.

టీటీడీ యాజమాన్యానికి. సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నట్లుగా పేర్కొన్నారు..

2015 నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న ఆయన టీటీడీ భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా బోర్డు మెంబర్ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.