దర్శకేంద్రుడి బుల్లి ప్రయత్నం.. అభిమానుల నిరాశ  

వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈయన దర్శకత్వంలో ఆమద్య వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఒక సినిమా అయితే విడుదలే కాలేదు. దాంతో రాఘవేంద్ర రావు గారు సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఆయన అభిమానులు మాత్రం సినిమా చేయాలని కోరుతున్నారు. కొన్ని రోజుల క్రితం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రెండు, మూడు కోట్ల బడ్జెట్‌ లో ఒక చిన్న చిత్రం రాబోతుంది, కథ బేస్ట్‌ చిత్రంగా అది ఉంటుందని వార్తలు వచ్చాయి. కాని అది నిజం కాదని తేలిపోయింది.

Raghavendra Rao Planning To Direct Web Series-

Raghavendra Rao Planning To Direct Web Series

తాజాగా మళ్లీ దర్శకత్వం గురించి దర్శకేంద్రుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే ఈసారి సినిమాపై కాకుండా వెబ్‌ సిరీస్‌ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రిలయన్స్‌ సంస్థతో కలిసి రాఘవేంద్ర రావు త్వరలోనే ఒక వెబ్‌ సిరీస్‌ను ప్రారంభించబోతున్నాడట. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో రాఘవేంద్ర రావు బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్‌ల హవా సాగుతున్న కారణంగా రాఘవేంద్ర రావు కూడా అటువైపుకు అడుగులు వేస్తున్నారు.

Raghavendra Rao Planning To Direct Web Series-

ఇప్పటి వరకు యువ దర్శకులు మాత్రమే వెబ్‌ సిరీస్‌లు చేస్తూ వచ్చారు. వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు వంటి స్టార్‌ డైరెక్టర్‌ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతా కొత్త వారితో తన శిష్యుల దర్శకత్వంలో తన పర్యవేక్షణలో కూడా ఇంకా కొన్ని వెబ్‌ సిరీస్‌ లను దర్శకేంద్రుడు ప్లాప్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమాలకు మెల్ల మెల్లగా రాఘవేంద్ర రావు దూరం అవ్వడం ఖాయంగా అనిపిస్తుంది. సినిమాలకు రాఘవేంద్ర రావు దూరం అవ్వడం అభిమానులకు నిరాశే అని చెప్పుకోవాలి.