దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సుదీర్ఘ విరామం తర్వాత చేయబోతున్న సినిమా పెళ్లి సందడి.ఈయన దర్శకత్వంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లి సందడి మళ్లీ రాబోతుంది.
కథ అదేనా లేదంటే వేరే కథ తో తీస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.పెళ్లి సందడి లో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక హీరోయిన్ విషయమై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పెళ్లి సందడి ప్రకటించినప్పటి నుంచి కూడా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.పెళ్లి సందడి సినిమా లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటింపజేయాలని ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.
రాఘవేంద్రరావు కి శ్రీదేవి అంటే అమితమైన అభిమానం. శ్రీదేవి హీరోయిన్ గా ఎన్నో సినిమాలను రాఘవేంద్రరావు చేసిన విషయం తెలిసిందే.
అందుకే ఇప్పుడు ఆయన కూతురు జాన్వీ కపూర్ తో కూడా రాఘవేంద్రరావు సినిమా తీయాలని భావించాడంటూ టాక్.
ఈ విషయం గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కానీ తాజాగా మరో విషయం ప్రచారం జరుగుతుంది.అది ఏంటంటే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కాకుండా ఆమె చిన్నకూతురు ఖుషి కపూర్ ను పెళ్లి సందడి సినిమాలో నటించబోతున్నారు.
ఖుషి కపూర్ ఇప్పటి వరకు సినిమాల్లో నటించలేదు.కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా వ్యవహరించింది.
హీరోయిన్ గా చేయాలనే కోరికతో ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందట.హీరోయిన్ ఎంపిక విషయంలో బోనికపూర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమా ను రోహన్ మరియు ఖుషి కపూర్ లతో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.