'పెళ్లిసందD' మేకర్స్‌ ఊరిస్తున్న ఆఫర్లు.. ఓకే చెప్పేనా?

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సూపర్‌ డూపర్ సక్సెస్ అయ్యింది.ఆ సినిమా అప్పటికి ఇప్పటికి ఒక సెన్షేషన్ అనడంలో సందేహం లేదు.

 ‘పెళ్లిసందd’ మేకర్స్‌ ఊరిస-TeluguStop.com

రాఘవేంద్ర రావు మార్క్‌ రొమాన్స్ మరియు పాటలు సినిమా గురించి ఇప్పటికి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.ఇప్పుడు ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కింది పెళ్లిసందD ఆ పెళ్లి సందడికి ఈ పెళ్లిసందD ఏమైనా సంబంధం ఉందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏదో సంబంధం ఉండటం వల్లే శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ను ఈ సినిమా కు హీరోగా ఎంపిక చేయడం జరిగిందని బలంగా కొందరు నమ్ముతున్నారు.ఈ సినిమా కు గౌరి అనే లేడీ దర్శకురాలు దర్శకత్వం వహించారు.

షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిన ఈ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేయాలని మొదట భావించారు.కాని థియేటర్లు ప్రారంభం అయ్యి సాదారణ పరిస్థితి వచ్చి చిన్న సినిమా లకు సందు దొరకాలంటే కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది.

అందుకే ఓటీటీ కి వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

పెళ్లిసందD సినిమా నుండి ఇటీవల వచ్చిన పాటలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి.

సినిమాలో హీరో మరియు హీరోయిన్‌ జోడీకి అంతా ఫిదా అవుతున్నారు.సినిమాకు సంబంధించిన కొన్ని సస్పెన్స్‌ లు సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎదురు చూసేలా చేసింది.

టైటిల్ కు చివర్లో ఇంగ్లీష్‌ డీ లెటర్ ఎందుకు పెట్టారు అంటూ కొందరు జుట్టు పీక్కుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ సినిమా రాఘవేంద్ర రావు మార్క్‌ తో ఉంటుందనే నమ్మకంతో చూడాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.సొంతంగా నిర్మించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన రాఘవేంద్ర రావు ఈ సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేసే విషయమై ఆలోచిస్తున్నాడట.

పలు ఓటీటీలు ఇప్పటికే దర్శకేంద్రుడితో సంప్రదింపులు జరిపారు.ఆశించిన మొత్తం లో ఇచ్చేందుకు ఒకరు ఇద్దరు సిద్దంగా ఉన్నారు.

దాంతో పెళ్లిసందD ని ఓటీటీ కి ఇచ్చే లా చర్చలు జరుపుతున్నారట.అంతా ఓకే అంటారా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube