కలర్‌ ఫుల్‌ 'పెళ్లి సంద‌D' వచ్చేది ఎప్పుడు గురూజీ?

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన పెళ్లి సందడి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా తో శ్రీకాంత్‌ ఫ్యామిలీ హీరో గా స్టార్‌ గా నిలిచాడు.

 Raghavendra Rao Pellisandad Movie Release Date-TeluguStop.com

అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న పెళ్లి సందడి సినిమా ను కాస్త అటు ఇటుగా సీక్వెల్‌ ప్రీక్వెల్‌ అన్నట్లుగా పెళ్లి సంద‌D అనే టైటిల్‌ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.రాఘవేంద్ర రావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తూ స్వయంగా ఒక పాత్రలో కనిపించబోతున్నాడు.

అద్బుతమైన కలర్‌ ఫుల్‌ సినిమా గా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంతో ఉన్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.ఈ సినిమా నుండి ఇప్పటికే పాటలు వచ్చాయి.తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.టైటిల్‌ సాంగ్‌ ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

Telugu Pellisandad, Prequel, Ragavendra Rao, Raghavendra Rao, Rohan, Srikanth, T

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుందని పెళ్లి సంద‌D సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి, రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకున్న పెళ్లి సందడి సినిమా కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని రాఘవేంద్ర రావు లుక్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.రోషన్ మరియు రాఘవేంద్ర రావుల కాంబోలో రూపొందుతున్న సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.కనుక ఈ సినిమా ను ఎప్పు డెప్పుడు విడుదల చేస్తారా అంటూ రాఘవేంద్ర రావును అభిమానులు అడుగుతున్నారు.మరి సినిమా ఈ ఏడాది వస్తుందా లేదా అనేది గురూజీ రాఘవేంద్ర రావు చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube