'పెళ్లి సందD' బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎంత కావాలి!

Raghavendra Rao Pellisandad Movie Collections

శ్రీకాంత్‌ తనయుడు రోషన్ హీరోగా శ్రీలీలా హీరోయిన్‌ గా రాఘవేంద్ర రావు నిర్మించి నటించిన పెళ్లి సందD సినిమా దసరా కానుకగా విడుదల అయ్యింది.ఈ సినిమాకు రివ్యూలు చెత్త అంటూ వచ్చాయి.

 Raghavendra Rao Pellisandad Movie Collections-TeluguStop.com

శ్రీకాంత్‌ తన కొడుకును గుడ్డిగా నమ్మి రాఘవేంద్ర రావు చేతిలో పెట్టాడు అంటూ కొందరు విమర్శిస్తే మరి కొందరు రాఘవేంద్ర రావు వంటి స్టార్‌ స్టేటస్ ఉన్న దర్శకుడు ఇలాంటి సినిమాలు చేస్తాడని ఎప్పుడు ఊహించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

పెళ్లిసందD సినిమా విడుదల అయిన కొన్ని గంటల్లోనే చెత్త అంటూ భారీగా స్ప్రెడ్ అయ్యింది.

 Raghavendra Rao Pellisandad Movie Collections-పెళ్లి సందD’ బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎంత కావాలి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రివ్యూలు మరీ దారుణంగా రావడంతో వసూళ్లు కోటి రెండు కోట్లే ఉంటాయని అనుకున్నారు.కాని అనూహ్యంగా దసరా మరియు రాఘవేంద్ర రావు రెండు కలవడం వల్ల సినిమా కు కాస్త ఊరట దక్కినట్లయ్యింది.

మొదటి మూడు రోజుల్లో సినిమా అయిదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.ఈ సినిమాను అన్ని ఏరియాలకు కలిపి 8.25 కోట్ల రూపాయలకు అమ్మారు అనేది సమాచారం.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల రెండవ రోజు అలాగే ఆదివారం కూడా హౌస్‌ ఫుల్‌ బోర్డులను దక్కించుకుంది.సినిమాలు పెద్దగా లేక పోవడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కంటికి ఇంపుగా ఉన్నట్లుగా పెళ్లి సందD ఉంది.కనుక టాక్ తో సంబంధం లేకుండా జనాలు కుమ్మేస్తున్నారు.

అందుకే తక్కువ సమయంలోనే ఊహించని వసూళ్లు నమోదు అయ్యాయి.కనుక ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ ను సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.మరో 3.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా ఇండస్ట్రీలో పెళ్లి సందD వసూళ్లు చాలా పెద్ద ఆశ్చర్యకర విషయంగా మారిపోయింది.సినిమా పోయిందని భావించిన యూనిట్‌ సభ్యులు వస్తున్న వసూళ్లతో ప్రమోషన్స్ మొదలు పెట్టారని తెలుస్తోంది.

#PellisandaD #Sri Leela #Roshan #PellisandaD

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube