నలుగురు హీరోయిన్స్‌ తో నటించబోతున్న రాఘవేంద్ర రావు  

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వరుసగా సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టాడు.తన దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాను మళ్లీ రూపొందించేందుకు సిద్దం అయ్యాడు.

TeluguStop.com - Raghavendra Rao In Samantha Sriya And Ramyakrishna Movie

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారు.తనికెళ్ల భరణి దర్శకత్వంలో సినిమాను రాఘవేంద్ర రావు నిర్మించబోతున్నారు.

సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అయ్యేది ఇంకా క్లారిటీ రాలేదు.ఇక ఈ సినిమాతో పాటు రాఘవేంద్రరావు మరికొన్ని సినిమాలను కూడా లైన్‌ లో పెడుతున్నారు.

TeluguStop.com - నలుగురు హీరోయిన్స్‌ తో నటించబోతున్న రాఘవేంద్ర రావు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈయన కేవలం నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న జనార్థన మహర్షి సినిమాలో రాఘవేంద్ర రావు ఒక ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు.

టాలీవుడ్‌ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విభిన్న చిత్రాల దర్శకుడు జనార్థన మహర్షి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో సమంత, శ్రియ, రమ్యకృష్ణ మరియు 18 ఏళ్ల అమ్మాయి కూడా నటించబోతున్నారు.మొత్తం నలుగురు హీరోయిన్స్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

ఈ నలుగురితో పాటు రాఘవేంద్ర రావు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ సినిమా మొత్తం కూడా ఈ అయిదుగురు చుట్టు తిరుగుతుందని అంటున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.రాఘవేంద్ర రావు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఉన్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఆయన వయసుకు తగ్గ పాత్రనే ఆయన చేయబోతున్నాడు.శ్రియ మరియు రమ్యకృష్ణలతో రాఘవేంద్ర రావు సినిమాలు చేశాడు.

కాని సమంతతో మొదటి సారి కలిసి వర్క్‌ చేయబోతున్నాడు.వచ్చే ఏడాదిలో ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సమంత ఈ సినిమా కోసం రెండు నెలల డేట్లు కేటాయించినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.అంటే ఈ సినిమా మొత్తం కూడా మూడు నాలుగు నెలల్లోనే పూర్తి అయ్యే అవకాశం ఉందన్నే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

#Ramya Krishna #Samantha #Sriya #Raghavendra Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు