రాఘవ లారెన్స్, కతిరేసన్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ 'రుద్రుడు' ఫస్ట్ లుక్ విడుదల, 2022 క్రిస్మస్‌కు థియేటర్లో విడుదల

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు.

 Raghava Lawrence, Kathiresan, Five Star Creations Llp’s Rudhrudu First Look Ou-TeluguStop.com

ఈ చిత్రానికి ‘రుద్రు’డు అనే టైటిల్‌ను పెట్టారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా యాక్షన్‌లో హైలైట్‌గా వుండబోతుంది.

ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్.ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తినిపెంచింది.

శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.సినిమా తొంభై శాతం షూటింగ్ పూర్తయింది.‘రుద్రుడు’ 2022 క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం:

రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం – కతిరేశన్

నిర్మాత- కతిరేశన్

బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి

ఎడిటర్: ఆంథోనీ

స్టంట్స్: శివ – విక్కీ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube