కాంచన షాకింగ్‌ కలెక్షన్స్‌

రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘కాంచన`2’(తెలుగులో గంగ) సినిమాకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.రెండు వారాల ముందు విడుదల అయిన ఈ సినిమాకు తమిళనాడుతో పాటు కేరళలో కూడా మంచి ఆధరణ లభిస్తోంది.

 Kanchana2 Collects 50 Crores In Two Weeks-TeluguStop.com

కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా 50 కోట్ల మార్క్‌ను దాటినట్లుగా తమిళ ట్రేడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికి కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

ఇంతటి స్థాయి కలెక్షన్స్‌ను దర్శకుడు రాఘవలారెన్స్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా ఊహించలేదు.ఈ విజయానికి దర్శకుడు లారెన్స్‌తో పాటు నిర్మాత సంతోషంతో పొంగిపోతున్నారు.

తమిళనాట ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో టాప్‌ 5వ స్థానంలో ‘కాంచన`2’ నిలిచినట్లుగా తమిళ సినీ ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు.రాఘవ లారెన్స్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా తాప్సి నటించగా, ముఖ్య పాత్రలో నిత్యామీనన్‌ నటించింది.

ఇక ఈ సినిమాను తెలుగులో ‘గంగ’గా విడుదల చేశారు.ఆర్థిక ఇబ్బందుల వల్ల వారం లేట్‌గా విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది.

మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా 15 కోట్లు వసూళ్లు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.మొత్తానికి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్‌ చిత్ర యూనిట్‌ సభ్యులకే షాక్‌ ఇస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube