హ్యాట్సాప్‌... లారెన్స్‌ నవ్వు రియల్‌ హీరోవి  

Raghava Lawrence Is The Real Hero In His Real Life-raghava Lawrence Builds A Home For Poor Woman,telugu Viral News,viral In Social Media

కొరియోగ్రాఫర్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించిన లారెన్స్‌ ఆ తర్వాత ఏ స్థాయిలో ఇండస్ట్రీలో ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈయనకు స్టార్‌డం దక్కింది. కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగానే కాకుండా లారెన్స్‌ సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు..

హ్యాట్సాప్‌... లారెన్స్‌ నవ్వు రియల్‌ హీరోవి-Raghava Lawrence Is The Real Hero In His Real Life

పలు చారిటీలు నిర్వహిస్తున్న లారెన్స్‌ తాజాగా హైదరాబాద్‌లో కూడా తన నిధులతో ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. లారెన్స్‌ మరోసారి తన మంచి మనసుతో రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

కొందరు స్టార్స్‌ పబ్లిసిటీ కోసం ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకుంటాం అంటూ హామీలు ఇచ్చి ఫొటోలకు ఫోజులు ఇస్తారు. కాని లారెన్స్‌ మాత్రం అలా కాదు, ఒక హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు.

తాజాగా లారెన్స్‌ కేరళలో ఒక అవ్వకు ఇల్లు కట్టించి ఇచ్చాడు. గత ఏడాది కేరళను అతలాకుతలం చేసిన తుఫాన్‌ వల్ల ఆ బామ్మ ఇల్లు పూర్తిగా కొట్టుకు పోయింది. దాంతో ఆమె కన్నీరు మున్నీరు అయ్యింది..

ఆమె కన్నీరు పెట్టుకోవడం ఒక వీడియోలో చూసిన లారెన్స్‌ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి తాను సాయం చేస్తానంటూ మాట ఇచ్చాడు.

మాట ఇచ్చి మర్చి పోకుండా వెంటనే పనులు మొదలు పెట్టాడు. ఆమె కోరుకున్నట్లుగా ఇల్లు కట్టి ఇచ్చాడు. ఆమె ఇల్లు పూర్తి చేయడంతో పాటు, తాజాగా ఆమె ఇంట్లోకి స్వయంగా గృహప్రవేశం చేసేందుకు కేరళ వెళ్లాడు.

ఆమెతో పాటు పూజాలో పాల్గొని ఆమెకు ఇల్లును గృహ ప్రవేశం చేసి మరీ కానుకగా ఇచ్చాడు. వృద్దురాలికి ఇల్లు కట్టించి, గృహ ప్రవేశ కార్యక్రమంలో కూడా పాల్గొన్న లారెన్స్‌ను రియల్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ సోషల్‌ మీడియా జనాలు అంటున్నారు. ప్రస్తుతం లారెన్స్‌ కాంచన చిత్రాన్ని హిందీలో తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు..

ఆ తర్వాత కాంచన 4ను తమిళం మరియు తెలుగులో మొదలు పెట్టబోతున్నాడు.