లారెన్స్‌కు ఎన్ని సెల్యూట్స్‌ చేసినా తక్కువే

కొరియోగ్రాఫర్‌ కమ్‌ హీరో కమ్‌ డైరెక్టర్‌ లారెన్స్‌ తన మంచి మనసును చాటుకుంటూనే ఉన్నాడు.కరోనా విపత్తు నేపథ్యంలో తనవంతు సాయంగా మూడు కోట్ల విరాళంను ఇచ్చి రియల్‌ సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నాడు.

 Ragava Larence Journalist Mother-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా ఆయన తీరున దాతృత్వం చాటుకోవాలంటూ నలుగురు మెచ్చుకునేలా తన దాతృత్వంను చాటుకున్నాడు.మూడు కోట్లు ఇచ్చిన తర్వాత కూడా తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన కొందరు డాన్సర్ల బ్యాంకు అకౌంట్‌లో పాతిక వేల చొప్పున డబ్బులు కూడా జమ చేశాడు.

తాజాగా లారెన్స్‌ మరోసాని తన మంచి మనసును చాటుకున్నాడు.తాజాగా తమిళనాడుకు చెందిన ఒక జర్నలిస్ట్‌ తల్లి కేరళలో చికిత్స పొందుతూ మృతి చెందింది.ఆమె మృతదేహంను అప్పగించేందుకు హాస్పిటల్‌కు లక్షన్నర చెల్లించాల్సి ఉంది.ఆ జర్నలిస్ట్‌ వద్ద అంత డబ్బు లేకపోవడంతో లారెన్స్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

 Ragava Larence Journalist Mother-లారెన్స్‌కు ఎన్ని సెల్యూట్స్‌ చేసినా తక్కువే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ డబ్బులు చెల్లించి జర్నలిస్ట్‌ తల్లి మృతదేహంను తమిళనాడుకు వచ్చే ఏర్పాట్లు చేశాడు.

తమిళంలోనే కాకుండా ఇండియా మొత్తం మంచి క్రేజ్‌ను దక్కించుకున్న లారెన్స్‌ ఇలాంటి మంచి పనులతో మరింతగా స్టార్‌డంను దక్కించుకున్నాడు.

లారెన్స్‌ తన ఫౌండేషన్‌లో కొన్ని వందల మంది వికలాంగులకు మరియు వృద్దులకు ఆశ్రయం కల్పించాడు.ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను దేవుడిగా పూజిస్తారు.ఆయన గొప్పతనం అంతా ఇంతా కాదంటారు.ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో లక్ష్మీ బాంబ్‌ చేస్తున్న లారెన్స్‌ మరో వైపు చంద్రముఖి చిత్రం సీక్వెల్‌లో కూడా నటిస్తున్నాడు.

#Laxmi Bomb #Ragava Larence #Chandramukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు