సరిహద్దు గోడపై మరో రగడ...380 కోట్ల డాలర్లు  

Another Ragada On The Border Wall ... 380 Billion Dollars - Telugu Border Wall, Nri, Ragada On The American Border Wall, Telugu Nri News Updates, గోడపై మరో రగడ

అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ అధికారాన్ని తన విజయానికి తగ్గట్టుగా మలుచుకుంటున్నారు.గత అధ్యక్ష ఎన్నికల్లో గెలుపులో భాగమైన సరిహద్దు గోడ హామీ ని ట్రంప్ అమలు చేసే దిశగా జరిగిన తతంగం అందరికి తెలిసిందే.

Another Ragada On The Border Wall ... 380 Billion Dollars

ప్రతినిధుల సభలో మెక్సికో గోడ అనుమతి చెందక పోవడంతో, ట్రంప్ సరిహద్దు గోడని సెనేట్ లో ఆమోదించుకోవాలని చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు.

ఎట్టకేలకి ట్రంప్ గోడ కట్టే విషయంలో విజయం సాధించాడు.

అయితే తాజాగా అమెరికాలో అభివృద్ధి పనులలో భాగంగా బడ్జెట్ కేటాయింపులు జరిగిన సమయంలో ప్రజా ఆరోగ్యానికి ట్రంప్ కత్తెర పెట్టిన విషయం అందరికి తెలిసిందే ఈ క్రమంలోనే ట్రంప్ మెక్సికోతో ఆనుకుని ఉన్న సరిహద్దులలో భారీ గోడ నిర్మాణానికి సుమారు 380 కోట్ల డాలర్ల మిలటరీ నిధులని మళ్ళించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రజారోగ్యానికి, మరిన్ని సేవల కోసం వినియోగించాల్సిన సొమ్ముని మిలటరీకి మళ్లించిన ట్రంప్ మళ్ళీ ఇప్పుడు ఆ సొమ్ముని రక్షణ శాఖ నుంచీ సరిహద్దు గోడకి మళ్ళించడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.150 కోట్ల డాలర్ల కి మించి ఇవ్వడానికి లేదని డెమోక్రాట్లు వాదిస్తున్నారు.అంతేకాదు ట్రంప్ ఈ గోడ ని అడ్డుగా పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.

తాజా వార్తలు

Another Ragada On The Border Wall ... 380 Billion Dollars-nri,ragada On The American Border Wall,telugu Nri News Updates,గోడపై మరో రగడ Related....