అంబాలా ల్యాండ్ అయిన రాఫెల్స్ ,144 సెక్షన్ అమలు

మొదటి విడతలో భాగంగా 5 రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి.ఫ్రాన్స్ నుంచి 7 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భారత్ లోకి అడుగుపెట్టాయి.

 Rafale Fighter Jets Reached To Ambala Air Base,dassault Rafale Fighter Jet In In-TeluguStop.com

రాఫెల్ నాలుగోతరం యుద్ధ విమానం, ఇప్పుడు ఈ యుద్ధ విమానం భారత అమ్ములపొదిలో చేరడం తో అగ్రరాజ్యల సరసన భారత్ చేరినట్లు అయ్యింది.అత్యాధునిక టెక్నాలజీ తో పనిచేసే ఈ యుద్ధ విమానాల ద్వారా భారత్ ఇప్పుడు సొంత నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఇవి పనిచేయనున్నాయి.

సాధారణంగా ఇప్పటివరకు విదేశీ నావిగేషన్ ను ఉపయోగిస్తుండగా ఈ రాఫెల్ లో మాత్రం ‘నావిక్’ అనే సొంత నావిగేషన్ సిస్టం ఉండడం తో లక్ష్యాలను నిర్దేశించుకొని అవి పని చేయనున్నాయి.

17 వ వైమానిక స్వాడ్రన్ లో ఈ యుద్ధ విమానాలను ఉపయోగించనున్నారు.

రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరడం తో ఇప్పుడు రాడార్ వ్యవస్థలో కావొచ్చు,లక్ష్యాలను ఛేదించడం లో కావచ్చు, క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఈ యుద్ధ విమానాలు అత్యంత సులభంగా పని చేస్తాయి.నిమిషానికి 2,500 రౌండ్లు పేల్చే సామర్ధ్యం తో,50వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్ధ్యం, అలానే ఈ విమానంలో ఒక్కసారి ఫ్యూయల్ నింపితే దాదాపు 1800 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగల సామర్ధ్యం అన్ని కూడా ఈ యుద్ధ విమానాల సొంతం.అలానే ఇప్పటివరకు ఈ యుద్ధ విమానాలు ఫ్రాన్స్,ఈజిప్టు,ఖతార్ లలో మాత్రమే ఉండగా, ఇప్పుడు తాజాగా భారత అమ్ములపొదిలో వచ్చి చేరాయి.7 వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి భారత్ లోకి అడుగుపెట్టిన రాఫెల్ యుద్ధ విమానాలకు సుఖోయ్ విమానాలు గగనతలం లోనే స్వాగతం పలికాయి.

అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న ఈ యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఘన స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలుస్తుంది.

ఎలాంటి క్లిష్ట సమయంలో అయినా ఈ యుద్ధ విమానాలు శత్రువులను పడగొట్టి లక్ష్యాలను ఛేదిస్తుంది.ఇలాంటి యుద్ధ విమానం ఇప్పుడు భారత భూభాగంలోకి అడుగుపెట్టడం తో శత్రు దేశాలకు ఇది ఒక హెచ్చరికగా చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube