బయోపిక్ విషయంలో విజయ్ సేతుపతికి మద్దతుగా నిలబడ్డ రాధిక  

Radhika Supports Vijay Sethupathi, Kollywood, Tollywood, Muralitharan Biopic, Bharati Raja, Tamil Community, - Telugu Kollywood, Muralitharan Biopic, Radhika, Tamil Community, Tollywood, Vijay Sethupathi

ప్రస్తుతం కోలీవుడ్ మురళీధరన్ బయోపిక్ పై రచ్చ నడుస్తుంది.తమిళ సంఘాలు ఈ బయోపిక్ లో నటించొద్దు అంటూ విజయ్ సేతుపతిని నేరుగా హెచ్చరిస్తూ బెదిరింపుల పాల్పడుతున్నారు.

TeluguStop.com - Radhika Supports Vijay Sethupathi

ఇందులో నటిస్తే తమిళనాడులో విజయ్ సేతుపతి సినిమాలు చూడకుండా బహిష్కరించడం జరుగుతుందని అంటున్నారు.మురళీధరన్ తమిళ ద్రోహి అని, అలాంటి వ్యక్తి జీవిత కథలో నటించి తమిళ ప్రజలకి విజయ్ సేతుపతి ద్రోహం చేయకూడదని అంటున్నారు.

మరో వైపు ఈ విషయంలో కోలీవుడ్ లో కూడా ఒక వర్గం వారు విజయ్ సేతుపతికి సూచనలు చేస్తున్నారు.భారతీరాజా అయితే నేరుగా విజయ్ కి హితవు పలుకుతూ ఒక లేఖ కూడా విడుదల చేశారు.

TeluguStop.com - బయోపిక్ విషయంలో విజయ్ సేతుపతికి మద్దతుగా నిలబడ్డ రాధిక-General-Telugu-Telugu Tollywood Photo Image

మురళీధరన్ బయోపిక్ నుంచి తప్పుకోవాలని సూచించారు. శ్రీలంక క్రికెటర్ కావడమే కాకుండా అక్కడి తమిళ ప్రజల మనోభావాలకు మురళీధరన్ ఎప్పుడు విలువ ఇవ్వకుండా తన స్వార్ధం చూసుకున్నాడు అంటూ తమిళ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ బయోపిక్ విషయంలో విజయ్ సేతుపతి ఇప్పటి వరకు ఏ విధంగా కూడా స్పందించలేదు.ఈ వివాదం నడుస్తూ ఉండగానే సీనియర్ హీరోయిన్ రాధికా అతనికి అండగా నిలబడింది.

ఈ బయోపిక్ విషయంలో విజయ్ సేతుపతికి మద్దతుగా మాట్లాడింది.ఒక నటుడుకి జాతి, మత, ప్రాంత, భాషాభిప్రాయాలు ఉండవని, అతను ఎలా అయినా నటించవచ్చని చెప్పింది.

అలాగే సన్ నెట్ వర్క్ నడుపుతున్న ఐపీఎల్ క్రికెట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అతను బౌలింగ్ కోచ్ గా పని చేస్తున్నారని, అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.సన్ నెట్ వర్క్ వాళ్ళు సినిమాని, రాజకీయాలని, క్రీడాలని ఎప్పుడు వేరువేరుగా చూస్తారు.

కానీ మనం ఎందుకు రాజకీయ వివాదంలోకి నటుడు అయినా విజయ్ సేతుపతిని లాగుతారు అని పేర్కొంది.తన అభిప్రాయంలో ఎలాంటి వివాదం లేదని, ఈ విషయం అర్ధం చేసుకోవాలని రాధికా అందరికి హితవు పలికింది.

#Radhika #Tamil Community #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhika Supports Vijay Sethupathi Related Telugu News,Photos/Pics,Images..