దర్శకత్వం చేయడం చాలా గొప్పగా ఉంది అంటున్న బాలయ్య హీరోయిన్

హీరోయిన్స్ దర్శకురాలిగా సక్సెస్ కావడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది.టాలీవుడ్ లో మహానటి సావిత్రి హీరోయిన్ గా సక్సెస్ అయిన దర్శకురాలిగా మాత్రం ఫెయిల్ అయింది.

 Radhika Apte Opens Up About Her Directorial Debut, Bollywood, Tollywood, Bhanuma-TeluguStop.com

అయితే భానుమతి రామకృష్ణ మాత్రం హీరోయిన్ గా ఎంత సక్సెస్ అయ్యిందో దర్శకురాలిగా కూడా అంతే సక్సెస్ అయ్యింది.అలాగే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన తర్వాత దర్శకురాలిగా మారింది.

ఇక ఆమె డైరెక్టర్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి.వందకి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ గా విజయనిర్మలకి అరుదైన గుర్తింపు ఉంది.

ఆమె తర్వాత టాలీవుడ్ హీరోయిన్ నుంచి దర్శకురాలిగా మారి సక్సెస్ అయినవారు అంటే పెద్దగా లేరనే చెప్పాలి.కేవలం తెలుగులోనే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలలో కూడా హీరోయిన్ దర్శకురాలిగా మారి సక్సెస్ అయ్యింది తక్కువ.

రీసెంట్ గా బాలీవుడ్ లో కంగనా రనౌత్ మెగా ఫోన్ పట్టుకుంది.మణికర్ణిక సినిమాలో ఆమె కూడా భాగమైంది.

నెక్స్ట్ చేయబోయే సినిమాకి ఆమె పూర్తి స్థాయి దర్శకత్వ బాద్యత వహిస్తుంది.

Telugu Bollywood, Radhika Apte, Radhikaapte, Savitri, Sleepwalkers, Tollywood, V

ఇదిలా ఉంటే తెలుగులో లెజెండ్ సినిమాలో బాలకృష్ణకి హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే రీసెంట్ గా మెగా ఫోన్ పట్టింది.ఈమె హర్రర్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ జోనర్ లో స్లీప్‌వాకర్స్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది.స్లీప్‌వాకర్స్ లో షహానా గోస్వామి, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు.

పామ్స్‌ స్ప్రింగ్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రాధికా తాను దర్శకత్వం వహించిన ది స్లీప్‌వాకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది.తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నేనెప్పుడూ దర్శకురాలిగా మారాలనుకోలేదు.

హనీ ట్రెహాన్‌, అభిషేక్‌ చౌబేలకు కథ చెప్పినప్పుడు వారు దాన్ని చేయాలనుకున్నారు.కథ రాయడం అయిపోయాక దర్శకత్వం వహించాలనుకున్నా.

దర్శకత్వం చేయడం నాకు బాగా నచ్చిందని పేర్కొంది.భవిష్యత్తులో ఫీచర్ ఫిల్మ్ కి దర్శకత్వం వహిస్తానని ఈ సందర్భంగా చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube