హాస్పటల్ బెడ్ పై బాలకృష్ణ భామ, విషయమేంటంటే  

Radhika Apte Hospital Lockdown London - Telugu Coronavirus, Heroine Radhika Apte In Hospital For Fear Of Coronavirus, Instagram, Lockdown, London, Radhika Apte

కరోనా వైరస్ విపరీతముగా స్ప్రెడ్ అవుతున్న ఈ సమయంలో బాలకృష్ణ భామ రాధికా ఆప్టే ముఖానికి మాస్క్ ధరించి హాస్పటల్ లో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.దీనితో రాధికా ఆప్టే కు కరోనా సోకింది అంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి.

 Radhika Apte Hospital Lockdown London

ముఖానికి మాస్క్ ధ‌రించి హాస్పిటల్లో కూర్చున్న ఫొటోను రాధిక ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.అయితే ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ కూడా బాలయ్య భామ కు కరోనా సోకింది అని,ఆమె ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటోందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ కు దూరమై పోయి ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్ అంటూ అక్కడక్కడే చక్కర్లు కొడుతుంది.పైగా భర్త కూడా ఫారెన్ కావడంతో లండన్ టూ ఇండియా బాగా తిరిగేస్తుంటుంది రాధిక ఆప్టే.

కొన్ని రోజుల క్రితం ఇండియాకి వచ్చిన ఈ అమ్మడు తిరిగి లండన్‌కి వెళ్లాలనుకోగా, అయితే కరోనా వైరస్ కారణంగా ఎయిర్ పోర్ట్‌లలో కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయడంతో అమ్మడు ఇక్కడే లాక్ అయిపోయింది.పైగా ఇప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు.

హాస్పటల్ బెడ్ పై బాలకృష్ణ భామ, విషయమేంటంటే-Latest News-Telugu Tollywood Photo Image

మన వాళ్లతో పాటు ఫారెనర్స్‌ను కూడా క్వారెంటైన్ చేస్తున్నారు.ఇప్పుడు రాధిక ఆప్టే కూడా అలాగే ఉండిపోయింది.

ప్రస్తుతం ఈమె క్వారెంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఆమె ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో చూడగానే `గల్లీబాయ్` ఫేమ్ విజయ్ వర్మ ఓ గాడ్.జాగ్రత్త డార్లింగ్.దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటూ కామెంట్ చేశాడు.

దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది.ఈ కామెంట్లు మరీ ఎక్కువైపోవడంతో తాజాగా రాధిక క్లారిటీ ఇచ్చింది.

తాను కరోనా వైరస్ బారిన పడలేదని స్పష్టం చేసింది.నేను హాస్పిటల్‌కు వెళ్లాను.

అయితే కోవిడ్-19 పరీక్షల కోసం మాత్రం కాదు.నేను ఆరోగ్యంగానే ఉన్నాను.

అందరూ జాగ్రత్తగా ఉండండని రాధిక పోస్ట్ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhika Apte Hospital Lockdown London Related Telugu News,Photos/Pics,Images..