రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తున్న యూవీ క్రియేషన్స్- Radheshyam Movie Release Date April 28

Radheshyam Movie Release Date April 28, Tollywood, Bollywood, Indian Cinema, Young Rebal Star Prabhas, Pooja Hegde, Director Radhakrishna, UV Creations - Telugu April 28, Bollywood, Director Radhakrishna, Indian Cinema, Pooja Hegde, Radheshyam Movie, Tollywood, Uv Creations, Young Rebal Star Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ రాధేశ్యామ్.యూవీ క్రియేషన్స్ ఈ సినిమా మీద సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టింది.

 Radheshyam Movie Release Date April 28-TeluguStop.com

ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో పీరియాడికల్ లవ్ డ్రామాగా మూవీని తెరపై అద్భుతమైన దృశ్యకావ్యంగా ఆవిష్కరించారు.ఈ సినిమాతో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీఎంట్రీ ఇస్తుంది.

పారిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుంది.అప్పటి వాతావరణాన్ని దర్శకుడు రాధాకృష్ణ తెరపై అంతే అద్భుతంగా ఆవిష్కరించినట్లు తెలుస్తుంది.

 Radheshyam Movie Release Date April 28-రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తున్న యూవీ క్రియేషన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఆ మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది.

ఈ నెలాఖరుకి షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు.ఇప్పటికే ఆ సినిమా మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్ అయ్యింది.పూర్తిస్థాయిలో మోషన్ క క్యాప్చర్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా ఆది పురుష్ నిలవనుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యినట్లు తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మరో వైపు కొనసాగుతుంది.

ఈ నేపధ్యంలో ఏప్రిల్ 28న సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.అదే డేట్ ని కన్ఫర్మ్ చేసి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

బాహుబలి 2 మూవీ 2017లో అదే డేట్ ని రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 15 వందల కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలో రాధేశ్యామ్ మీద గట్టి నమ్మకంతో ఉన్న యూవీ క్రియేషన్స్ సెంటిమెంట్ గా కూడా వర్క అవుట్ అవుతుందని అదే డేట్ ని ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తుంది.

#Pooja Hegde #April 28 #UV Creations #YoungRebal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు