కరోనా రోగుల కోసం భారీ ఆస్తిని విరాళంగా ఇచ్చిన రాధేశ్యామ్ టీమ్..!

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం.కరోనా తగ్గిందిలే అనుకుని కుదుట పడుతున్నలోపే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.

 Radhe Shyam Team Donated Set Property To Hospital For Covid Patient-TeluguStop.com

హాస్పటల్ లో పడకలు, ఆక్సిజెన్ సిలిండర్లు అవసరం రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వాలకు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.ఎంతోమంది ఆక్సిజెన్ అందక మరణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మన సినీ పెద్దలు కూడా వారికీ తోచిన సహాయం అందిస్తున్నారు.పేద ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు.అలాగే రాధేశ్యామ్ టీమ్ కూడా కోవిడ్ రోగులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రత్యేకంగా నిర్మించిన హాస్పిటల్ సెట్ లో ఉన్న ఆస్తిని మొత్తం విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

 Radhe Shyam Team Donated Set Property To Hospital For Covid Patient-కరోనా రోగుల కోసం భారీ ఆస్తిని విరాళంగా ఇచ్చిన రాధేశ్యామ్ టీమ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Covid Patients, Donate, Prabhas, Radhe Shyam, Radhe Shyam Team, Radhe Shyam Team Donated Set Property To Hospital For Covid Patients, Set Property-Movie

ఈ హాస్పిటల్ సెట్ లో పడకలు ప్రత్యేకంగా చేయించారు.ఈ సెట్ లో షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ హాస్పిటల్ ఆస్తిని విరాళంగా ఇచ్చారు.ఆ సెట్ మొత్తాన్ని కూల్చివేసి అందులో ఉన్న ఆస్తిని జాగ్రత్తగా కరోనా ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.ఆ సెట్ లో ఉన్న మంచాలు, స్ట్రెచర్లు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు ఇలా ఇంకా చాలా వస్తువులను కరోనా ఆసుపత్రికి దానంగా ఇచ్చారు.

ఈ విషయంపై టీమ్ మొత్తాన్ని ప్రత్యేకంగా నిర్మాతలను అందరు ప్రశంసిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

ఈ సినిమాను జులై లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన కరోనా కారణంగా మళ్ళీ వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది.

#Radhe Shyam #Prabhas #Donate #RadheShyam #Covid Patients

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు