'ఆషికి ఆగయి'.. అందంగా కనిపిస్తున్న ప్రభాస్, పూజా!

Radhe Shyam Song Aashiqui Aa Gayi Teaser

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధేశ్యామ్’.ఎన్నో రోజుల నుండి డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

 Radhe Shyam Song Aashiqui Aa Gayi Teaser-TeluguStop.com

ఇక ఎట్టకేలకు ఎప్పుడా ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.

 Radhe Shyam Song Aashiqui Aa Gayi Teaser-ఆషికి ఆగయి’.. అందంగా కనిపిస్తున్న ప్రభాస్, పూజా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా మరొక అప్డేట్ తో వచ్చారు.ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ను విడుదల చేసారు.

అయితే ఇది హిందీ వెర్షన్ లో మాత్రమే రిలీజ్ అయ్యింది.ఆషికి ఆ గయీ అంటూ సాగె ఈ పాట ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ సాంగ్ లో ప్రభాస్, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు.

వీరిద్దరి జోడీ కూడా సూపర్ అనిపిస్తుంది.

లవ్, ఎమోషనల్ ఫీలింగ్ తో ఇద్దరు కూడా అలరించారు.

ఇక ముందు హిందీ వెర్షన్ రావడంతో తెలుగు అభిమానులు నిరాశ చెందారు.ఇక మిగతా భాషల్లో ఇవాళ సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమా విషయానికి వస్తే.

ఇది ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.ఈ ప్రేమ కథకు అద్బుతమైన గ్రాఫిక్స్ యాడ్ చేసి మన ముందుకు రాబోతున్నారు.

ఇక ప్రభాస్, పూజా మధ్య రొమాన్స్ అద్భుతంగా వచ్చిందని ముందు నుండి చెబుతున్న మాటే.ఇక ఇప్పుడు వచ్చిన ఆషికి పాట చూస్తే అది కరెక్ట్ అని అర్ధం అవుతుంది.ఇక వరుస అప్డేట్ లు చూస్తున్న అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో ఈ సినిమాను చూడాలా అని ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతుంది.

చూడాలి మరి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఏ రేంజ్ హిట్ అవుతుందో.

#RadheShyam #Prabhas #RadhaKrishna #Pooja Hegde #Radhe Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube