సంక్రాంతి బరిలోనే పోటీకి దిగనున్న రాధేశ్యామ్… రిలీజ్ డేట్ పరిశీలన  

Radhe Shyam Release Date Planing, Tollywood, Bollywood, Pan India Movie, Director Radhakrishna, Darling Prabhas, Pooja Hegde, UV Creations - Telugu Bollywood, Darling Prabhas, Director Radhakrishna, Pan India Movie, Pooja Hegde, Radhe Shyam, Tollywood, Uv Creations

డార్లింగ్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది.

TeluguStop.com - Radhe Shyam Release Date Planing

ఇందులోపూజా హెగ్డే ప్రభాస్ కి జోడీగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.పీరియాడికల్ రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ని రివీల్ చేశారు.అలాగే డార్లింగ్ ప్రభాస్ పాత్రని కూడా పరిచయం చేశారు.

TeluguStop.com - సంక్రాంతి బరిలోనే పోటీకి దిగనున్న రాధేశ్యామ్… రిలీజ్ డేట్ పరిశీలన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు.

అయితే కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆరు నెలలు షూటింగ్ లేకుండా ఆగిపోయింది.

అయితే లాక్ డౌన్ అనంతరం మరల టీం ఇటలీ వెళ్ళిపోయి షూటింగ్ చేసుకుంటున్నారు.

మేగ్జిమమ్ సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు.ఇక పెండింగ్ అంతా హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇప్పటి నుంచే నిర్మాతలు రెడీ అవుతున్నారు.డేట్స్ లాక్ చేసే పనిలో ఉన్నారు.

రాధేశ్యామ్ డేట్ లాక్ చేస్తే ఆ సమయంలో మిగిలిన వాళ్ళు రిలీజ్ వాయిదా వేసుకునే అవకాశం ఉంటుందని దానికి ప్లాన్ చేస్తున్నారు.దీంతో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్రస్తుతం రెండు తేదీలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది జనవరి 1న కానీ, సంక్రాంతి సందర్భంగా జనవరి 14న కానీ విడుదల చేయాలని భావిస్తున్నారట.ఈ రెండింటిలోనూ ఒక తేదీని త్వరలోనే ఫైనల్ చేస్తారని అంటున్నారు.

#Darling Prabhas #Radhe Shyam #UV Creations #Pan India Movie #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhe Shyam Release Date Planing Related Telugu News,Photos/Pics,Images..