బాహుబలి-2పై కన్నేసిన రాధేశ్యామ్  

Radhe Shyam Release Date Fixed, Radhe Shyam, Prabhas, Baahubali2, Tollywood News - Telugu Baahubali2, Prabhas, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు.

 Radhe Shyam Release Date Fixed

కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను ఎప్పుడో ప్రారంభించినా, చాలా ఆలస్యంగా షూటింగ్ జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్‌పై స్పష్టత లేకుండా పోయింది.

ఇక ఈయేడు సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించడంతో శరవేగంగా షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ చేయాలని చూశారు.కానీ కరోనా వైరస్ వారి ఆశలపై నీళ్లు జల్లింది.

బాహుబలి-2పై కన్నేసిన రాధేశ్యామ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా 2021 ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

గతంలో ఏప్రిల్ 28న ప్రభాస్ నటించిన బాహుబలి 2 చిత్రం రిలీజ్ కావడంతో ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఆ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ మూవీగా నిలిచింది.

ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ గుర్తింపును తెచ్చుకున్నాడు.మరి రాధేశ్యామ్ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి రిజల్ట్‌ను దక్కించుకుంటాడో చూడాలి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

#Baahubali2 #Prabhas #Radhe Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhe Shyam Release Date Fixed Related Telugu News,Photos/Pics,Images..