త్వరలో షూటింగ్ కి వెళ్లనున్న రాధేశ్యామ్ టీమ్… హైదరాబాద్ లోనే ఫినిష్  

Radhe Shyam Movie Shooting Will be Start soon, Darling Prabhas, Pooja Hegde, Director Radha Krishna, UV Creations - Telugu Darling Prabhas, Director Radha Krishna, Pooja Hegde, Radhe Shyam Movie Shooting Will Be Start Soon, Uv Creations

డార్లింగ్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

TeluguStop.com - Radhe Shyam Movie Shooting Will Be Start Soon

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

పారిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతుంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.ఇక మెజారిటీ షూటింగ్ విదేశాలలో ఇప్పటికే కంప్లీట్ చేసేశారు.

TeluguStop.com - త్వరలో షూటింగ్ కి వెళ్లనున్న రాధేశ్యామ్ టీమ్… హైదరాబాద్ లోనే ఫినిష్-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాలో అడుగు పెట్టిన తర్వాత లాక్ డౌన్ మొదలైంది.ఇక ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చి షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన మళ్ళీ విదేశాలు వెళ్లి షూటింగ్ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.

పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లు ప్రారంభించడానికి నిర్మాతలు సంకోచిస్తున్నారు.అయితే రాధేశ్యామ్ కొంత టాకీ పార్ట్, యాక్షన్ సీక్వెన్స్, సాంగ్స్ పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది.

ఇక వీటి కోసం విదేశాలకి వెళ్లకుండా హైదరాబాద్ లోనే పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళికలు వేసుకుంది.

అందులో భాగంగా అన్నపూర్ణ, రామోజీ ఫిలిం సిటీలో రెండు భారీ సెట్స్ ని ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే విధంగా నిర్మిస్తున్నారు.

అందులో హాస్పిటల్ సెట్స్ రామోజీలో వేస్తున్నారని తెలుస్తుంది.ఈ సెట్స్ నిర్మాణం పూర్తి కాగానే తక్కువ మంది క్రూతో సినిమా షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి షెద్యూల్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సెట్ లో సినిమాలోని కీలక సన్నివేశాలని, అలాగే యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.అన్ని అనుకూలంగా జరిగితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రాధేశ్యామ్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే నాగ్ అశ్విన్ సినిమాతో ప్రభాస్ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.

#Darling Prabhas #RadheShyam #UV Creations #DirectorRadha #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhe Shyam Movie Shooting Will Be Start Soon Related Telugu News,Photos/Pics,Images..