రాధేశ్యామ్ కు గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడో.. తెరపై కనిపించేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది  

Radhe Shyam Movie Release Update, Radhe Shyam , Prabhas, Krishnam Raju, UV Creations, Prabhas Fans, Radhe Shyam movie Shooting,Pooja Hegde - Telugu Krishnam Raju, Pooja Hegde, Prabhas, Prabhas Fans, Radha Krishna, Radhe Shyam, Radhe Shyam Movie Release Update, Radhe Shyam Movie Shooting, Radhe Shyam Release Date, Uv Creations

ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.ఇటీవలే కృష్ణం రాజు తన బర్త్‌ డే సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ప్రభాస్‌ కు మద్య కాంబో సీన్స్‌ చిత్రీకరించాల్సి ఉంది.

TeluguStop.com - Radhe Shyam Movie Release Update

ఇప్పటికే పాటలు అన్ని పూర్తి అయ్యాయి.మా కాంబో సీన్స్ కూడా పూర్తి చేసి ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లుగా ఆయన చెప్పాడు.

కాని ఏప్రిల్‌ లో రాధే శ్యామ్‌ సినిమా వచ్చే అవకాశం లేదు.అసలు ఇప్పటికే సినిమా షూటింగ్‌ బ్యాలన్స్ ఉండటంతో పాటు ఏప్రిల్‌ లో పెద్ద సినిమాలు పోటీగా ఉన్న కారణంగా మంచి డేట్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు అన్వేషించి చివరకు మే 28న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

TeluguStop.com - రాధేశ్యామ్ కు గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడో.. తెరపై కనిపించేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక సినిమా షూటింగ్‌ ను ఫిబ్రవరి చివరి వారం వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.మూడు వారాల పాటు పెదనాన్న మరియు ప్రభాస్ లు నటిస్తే గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉంటుంది.ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ విషయంలో యూవీ క్రియేషన్స్‌ వారు అభిమానులకు ఏమాత్రం సహకరించడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పెద్ద ఎత్తున రాధేశ్యామ్‌ ను నిర్మిస్తున్నాం అనే పేరు కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ ను ఖచ్చితంగా ఇచ్చిందే లేదు.

సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే స మయంలో అయినా యూవీ వారు పబ్లిసిటీ హడావుడి చేస్తారేమో చూడాలి.రాధే శ్యామ్‌ అప్‌ డేట్‌ కోసం ఒకానొక సమయంలో ప్రభాస్ అభిమానులు యూవీ క్రియేషన్స్‌ పై ఒత్తిడి తీసుకు వచ్చారు.

ఆ ఒత్తిడి వల్లే యూవీ వారు అప్ డేట్ ఇచ్చారు.ఇప్పుడు షూటింగ్‌ పూర్తి అయ్యేది ఎప్పుడు అనే విషయాన్ని కూడా చెప్పాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

#Prabhas #UV Creations #Prabhas Fans #Radha Krishna #Krishnam Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు