'రాధేశ్యామ్‌' బడ్జెట్‌ మరియు బిజినెస్‌ అంచనా

ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రాధాకృష్ణ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం రాధేశ్యామ్‌.ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.

 Prabhas And Pooja Hegde Radhe Shyam Movie Budget And Pre Release Business , Radh-TeluguStop.com

కరోనా మళ్లీ విజృంభించకుంటే ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ పూర్తి చేసి విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చేసేవారు.సినిమా ను జులై లో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా వచ్చింది.కరోనా వల్ల సినిమా మళ్లీ ఆలస్యం అయ్యింది.

గత ఏడాది లోనే సినిమా గురించిన విడుదల తేదీని ప్రకటించారు.కాని విడుదల వాయిదా పడింది.

మూడు నాలుగు సార్లు విడుదల తేదీలు మార్చినా కూడా ఈ సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అందుకే ఈ సినిమా భారీ బిజినెస్ ను చేయడంతో పాటు రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Pooja Hegde, Prabhas, Prabhaspooja, Radheshyam, Uv-Movie

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్ సినిమాను దాదాపుగా 250 కోట్లకు పైబడిన బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు.అందుకు తగ్గట్లే సినిమా బిజినెస్ చేస్తోంది.ఇటీవలే వచ్చిన వార్తలను అనుసరించి ఈ సినిమా ఓవర్సీస్ లో 30 కోట్ల మేరకు బిజినెస్ చేస్తుందట.ఇక నార్త్‌ ఇండియాలో ఈ సినిమా ఏకంగా 80 కోట్లకు మించి బిజినెస్ చేస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల వరకు బిజినెస్‌ చేస్తుందని అంటున్నారు.

ఇతర రాష్ట్రాలు మరియు దేశాల్లో కలిపి మొత్తంగా థియేట్రికల్‌ రైట్స్‌ దాదాపుగా 300 కోట్ల వరకు చేసే అవకాశం ఉందని ఒక అంచనాకు వచ్చారు.కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారానే అంత భారీ మొత్తానికి ద్కించుకుంటే ఇక నాన్ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా 170 నుండి 200 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

మొత్తంగా ఈ సినిమా విడుదలకు ముందే దాదాపుగా 500 కోట్లు అంటే పెట్టుబడికి రెట్టింపు మొత్తంను సంపాదిస్తుందని అంటున్నారు.సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ అయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube