రాధేశ్యామ్ మోషన్ పోస్టర్.. అరచేతిలో సినిమా చూపించేశారుగా!  

Radhe Shyam Motion Poster Released, Prabhas, Radhe Shyam, Radhy Shyam Motion Poster, Radha Krishna, Pooja Hegde - Telugu Pooja Hegde, Prabhas, Radha Krishna, Radhe Shyam, Radhy Shyam Motion Poster

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుండో జరుపుకుంటున్నా, ఇప్పటివరకు రిలీజ్ కాకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

TeluguStop.com - Radhe Shyam Motion Poster Released

సాహో తరువాత ఈ సినిమా వస్తుండటంతో పాన్ ఇండియా రేంజ్‌లో మరోసారి బాహుబలి లాంటి ప్రభంజనం సృష్టించాలని ప్రభాస్ అభిమాలనులు కోరుతున్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను ఇటీవల చిత్ర యూనిట్ వరుసబెట్టి రిలీజ్ చేస్తూ వస్తోంది.

ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది.అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

TeluguStop.com - రాధేశ్యామ్ మోషన్ పోస్టర్.. అరచేతిలో సినిమా చూపించేశారుగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ మోషన్ పోస్టర్‌లో చరిత్రలో నిలిచిపోయే ప్రేమకథలను మనకు గుర్తుకుచేశారు.రోమియో-జూలియెట్, సలీమ్-అనార్కలి, దేవదాస్-పారు లాంటి ప్రేమకథకు సరిసమానంగా ఈ రాధేశ్యామ్ ప్రేమకథ కూడా ఉండబోతున్నట్లు మోషన్ పోస్టర్‌లో తెలియజేసే ప్రయత్నం చిత్ర యూనిట్ చేశారు.

అయితే ఈ మోషన్ పోస్టర్‌లో కేవలం ప్రభాస్, పూజా హెగ్డేలు మాత్రమే సహజంగా ఉండటం, మిగతా కాన్సెప్ట్ పూర్తిగా గ్రాఫిక్స్‌తో ఉండటం కొంతమేర ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.ఏదేమైనా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ ఇక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో హీరోహీరోయిన్లు రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.పూర్వజన్మల ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల టాక్.

డియర్ కామ్రేడ్ చిత్రానికి సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో సంగీతం అందిస్తున్నాడు.మరి రాధేశ్యామ్ మోషన్ పోస్టర్‌ను మీరు ఓసారి చూసేయండి.

#Prabhas #RadhyShyam #Radha Krishna #Pooja Hegde #Radhe Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhe Shyam Motion Poster Released Related Telugu News,Photos/Pics,Images..