ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు  

radhye shyam motion poster creates record Prabhas, Radhe Shyam, Pooja Hegde, 25 Millione Plus Views, Jill, Radha Krishna Kumar, Gopikrishna Movies, Uv Creations - Telugu 25 Millione Plus Views, Gopikrishna Movies, Jill, Pooja Hegde, Prabhas, Radha Krishna Kumar, Radhe Shyam, Radhye Shyam Motion Poster Creates Record, Uv Creations

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ డైరెక్షన్‌లో ‘రాధేశ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

TeluguStop.com - Radhye Shyam Motion Poster Creates Record

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్దే నటిస్తోంది.కరోనాకు ముందే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తవ్వగా.

ఆ తర్వాత కరోనా ప్రభావం పెరగడం, లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌ ఆగిపోయింది.

TeluguStop.com - ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టారు.

ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతోంది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా రాధేశ్యామ్ విడుదలకు ముందే రికార్డులు నమోదు చేస్తోంది.ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న రాధే శ్యామ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా.

ఇది సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.కేవలం నాలుగు రోజుల్లో ఈ మోషన్‌ పోస్టర్‌ 25 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌ సాధించింది.

ఇండియాన్ సినిమాలో చరిత్రలో ఒక మోషన్ పోస్టర్‌కు అత్యధిక వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని సినీ వర్గాలు చెబుతున్నారు.సినిమా రిలీజ్‌కు ముందే అభిమానులు ఇంతగా ఆదరించడం చాలా ఆనందంగా ఉందని రాధేశ్యామ్ యూనిట్ ప్రకటించింది.

#Pooja Hegde #Radhe Shyam #Prabhas #RadhaKrishna #25Millione

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhye Shyam Motion Poster Creates Record Related Telugu News,Photos/Pics,Images..