రాధేశ్యామ్ దర్శకుడికి ఝలక్.. సొంతం కాదట!  

Radhe Shyam Director Instagram Account Blocked, Radhe Shyam, Instagram, Blocked, Prabhas, Radha Krishna - Telugu Blocked, Instagram, Prabhas, Radha Krishna, Radhe Shyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ పోస్టర్‌తో సోషల్ మీడియాలో ప్రభాస్ సందడి చేస్తున్నాడు.

 Radhe Shyam Instagram Blocked

ఇక ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.కాగా ఈ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణకు తాజాగా ఓ విచిత్ర అనుభవం ఎదురైంది.

రాధాకృష్ణకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను సదరు యాజామాన్యం బ్లాక్ చేసింది.ఇది తనకు చెందిన అకౌంట్ కాదనే కారణంతో ఈ అకౌంట్‌ను బ్లాక్ చేసిందట ఇన్‌స్టాగ్రామ్.‘మరి ఈ అకౌంట్ ఎవరిది?’ అని రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నాడు.ఇలాంటి అనుభవాలు చాలా అరుదుగా ఎదురవుతాయని ఆయన అంటున్నారు.

రాధేశ్యామ్ దర్శకుడికి ఝలక్.. సొంతం కాదట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా రాధకృష్ణ అకౌంట్ ఎందుకు బ్లాక్ అయ్యిందనే విషయంపై ఆయనకు చెందిన సోషల్ మీడియా టీమ్ వర్క్ చేస్తోంది.

అయితే ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ విషయంలో ఆలస్యం అవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాధాకృష్ణ అకౌంట్‌కు పెద్ద సంఖ్యలో రిపోర్టు కొట్టినట్లు తెలుస్తోంది.

ఈ కారణంగానే ఆయన అకౌంట్ బ్లాక్ అయ్యి ఉండవచ్చని తెలుస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఏదేమైనా రాధేశ్యామ్ చిత్ర దర్శకుడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ కావడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

#Prabhas #Radha Krishna #Instagram #Radhe Shyam #Blocked

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhe Shyam Instagram Blocked Related Telugu News,Photos/Pics,Images..