ఇటలీలో పనికానిచ్చేసిన రాధేశ్యామ్  

Radhe Shyam Completes Italy Schedule, Radhe Shyam, Prabhas, Pooja Hegde, Italy Schedule, Radha krishna, Tollywood News - Telugu Italy Schedule, Pooja Hegde, Prabhas, Radha Krishna, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.కాగా ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతుండగా కరోనా ప్రభావం నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు.

TeluguStop.com - Radhe Shyam Completes Italy Schedule

ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఇటలీలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లారు.అక్కడ కొన్ని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించినట్లు రాధేశ్యామ్ యూనిట్ తెలిపింది.

అయితే ఇటలీకి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావడంతో చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు సిద్ధమైంది.పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రాధేశ్యామ్ తెరకెక్కిస్తుండటంతో, ఇటలీ లాంటి దేశంలోని అందమైన ప్రదేశాల్లో ఈ షూటింగ్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్.

TeluguStop.com - ఇటలీలో పనికానిచ్చేసిన రాధేశ్యామ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ చిత్రంపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా కథ పూర్వజన్మ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా అందాల భామ పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో నటిస్తుంది.

డియర్ కామ్రేడ్ చిత్రానికి సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ రాధేశ్యామ్‌కు సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.మరి రాధేశ్యామ్ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Radhe Shyam #Pooja Hegde #Prabhas #Radha Krishna #Italy Schedule

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhe Shyam Completes Italy Schedule Related Telugu News,Photos/Pics,Images..