సల్మాన్ ఇమేజ్ దెబ్బకి జీ5 యాప్ భారీ డ్యామేజ్... స్పీడ్ ని తట్టుకోలేక

సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమా తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమాని ఒటీటీ ద్వారా పే ఫర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేశారు.జీ5 ఒటీటీ ద్వారా ఈ మూవీని రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సిటీమార్ సాంగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

 Radhe Movie Got Huge Response In G5 Ott-TeluguStop.com

అలాగే ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో పాటు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.సల్మాన్ ఖాన్ సినిమా అంటే థియేటర్ లో రిలీజ్ చేస్తే మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్ వచ్చేస్తుంది.

ఆ స్థాయిలో అతని సినిమాలకి క్రేజ్ ఉంటుంది.

 Radhe Movie Got Huge Response In G5 Ott-సల్మాన్ ఇమేజ్ దెబ్బకి జీ5 యాప్ భారీ డ్యామేజ్… స్పీడ్ ని తట్టుకోలేక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా సల్మాన్ ఖాన్ ఉన్నారు.

చాలా గ్యాప్ తర్వాత సల్లుభాయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాధే చిత్రం నేరుగా స్ట్రీమింగ్ కు రావడంతో భాయ్ దెబ్బకు జీ 5 వారి స్ట్రీమింగ్ యాప్ క్రాష్ అయ్యిపోయిందట.

మొత్తం 1 మిలియన్ మందికి పైగానే సినిమా చూసేందుకు రావ‌డంతో ఇలా జ‌రిగింద‌ని అంటున్నారు.పే ప‌ర్ వ్యూ తీసుకొచ్చిన కూడా అభిమానుల ఆద‌ర‌ణ బాగానే ద‌క్కింద‌ని తెలుస్తుంది.

దిశా పటానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ మొత్తం కరోనా బాధితులకి విరాళంగా ఇస్తామని ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఒటీటీలో రిలీజ్ అయిన రాధే సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.

#Disha Patani #G5 OTT #Prabhudeva #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు