బిగ్ బాస్ హౌస్ లోకి మాతాజీ రాధేమా  

radhe maa entry in bigg boss house 14, Bollywood, Salman Khan, Bigg Boss-14., Spiritual Guru Radhe Maa - Telugu Bigg Boss 14, Bollywood, Radhe Maa Entry In Bigg Boss House 14, Salman Khan, Spiritual Guru Radhe Maa

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటికే స్టార్ మాలో ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం అందిస్తుంది.మూడో వారం పూర్తి చేసుకున్న ఈ షో నుంచి వెళ్ళినవారు గతంలో మాదిరి కాకుండా బయటకి వచ్చిన వెంటనే షో గురించి సంచలన వాఖ్యలు చేస్తున్నారు.

TeluguStop.com - Radhe Maa Entry In Bigg Boss House 14

బిగ్ బాస్ గుట్టు విప్పుతున్నారు.ఏది ఏమైనా షోమాత్రం యధావిధిగా ప్రేక్షకుల అంచనాలని అందుకునే విధంగా సాగుతుంది.

ఇదిలా ఉంటే త్వరలో హిందీ బిగ్ బాస్ షో కూడా ప్రారంభం కాబోతుంది.ఈ షోకి సంబందించిన వీడియో ప్రోమో కూడా ఇప్పటికే రిలీజ్ చేసి ప్రేక్షకులలో ఉత్సాహం నింపారు.

TeluguStop.com - బిగ్ బాస్ హౌస్ లోకి మాతాజీ రాధేమా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ సారి బిగ్ బాస్ సీజన్ 14లో ఎవరెవరు పాల్గొంటారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.ఇదిలా ఉంటే ప్రతిసారి వివాదాస్పద వ్యక్తులని హౌస్ లోకి తీసుకొని వచ్చే హిందీ బిగ్ బాస్ టీం ఈ సారి కూడా ఓ వివాదాస్పద మతబోధకురాలుని హౌస్ లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.

దేశ వ్యాప్తంగా అనేకమంది భక్తులని కలిగి ఉన్న మోడరన్ సన్యాసిని రాధేమా చుట్టూ చాలా వివాదాలు నెలకొని ఉన్నాయి.తనకి తానే దైవాంశంగా ప్రకటించుకున్న ఈమెని ఫాలో అయ్యేవారు లక్షల్లో ఉన్నారు.

ఈ సారి బిగ్ బాస్ షోకి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి.వీటిలో హీరో సల్మాన్ ఖాన్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

మరో వీడియోలో రాధేమా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూ కనిపిస్తున్నారు.షోలో రాధేమా ఎంట్రీపై ప్రేక్షకులకి అప్పుడే ఆసక్తి పెరిగింది.

బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్న రాథేమా ఎర్రని దుస్తులు ధరించారు.ఆద్యాత్మిక బోధకురాలిగా పేరొందిన ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఎంత వరకు సందడి చేస్తుంది.

ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుంది అనేది వేచి చూడాలి.

#SpiritualGuru #Salman Khan #RadheMaa #Bigg Boss 14

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhe Maa Entry In Bigg Boss House 14 Related Telugu News,Photos/Pics,Images..