కేంద్ర మంత్రులకు జగన్ లంచాలు ? ఆర్కే సంచలన పలుకులు 

తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ముద్రపడిన ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం కొత్త పలుకులు పేరుతో ఆ పత్రిక ఎండి రాధాకృష్ణ (ఆర్కే) రాసే ఆర్టికల్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది.ఏపీ తెలంగాణ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాలను విశ్లేషిస్తూ సాగే ఈ ఆర్టికల్స్ ఎక్కువగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

 Radhakrishna Made Sensational Allegations Against The Jagan Government In The An-TeluguStop.com

దీంతో ప్రతి వారం వచ్చే కొత్తపలుకు ఆర్టికల్ కాస్త వైరల్ గా మారుతూ వస్తోంది.తాజాగా ఈ వారం ఆర్కే తన కొత్త పలుకుల్లో కొన్ని కొన్ని కవితలతో కూడిన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

విద్యావంతులు అప్రయోజకులయ్యారు.శుంటలు సభా పుజ్యులయ్యారు.

సత్యవంతుల మాట జనానికి రుచించడం లేదు.వదరుబోతుల మాటే చెల్లుబాటు అవుతోంది.

దుష్ట మానవులు వర్ధిల్లుతున్నారు అంటూ తెలంగాణకు చెందిన శేషప్ప కవి రచించిన కవితను ప్రస్తావించారు.

ఇదంతా జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది అర్థమైపోతుంది.

అయితే ఈవారం కొత్త పాలుకుల్లో మరిన్ని సంచలనాలు ఉండేలా చూసుకున్నారు.కేంద్ర మంత్రులకు జగన్ ప్రభుత్వం లంచాలు ఇస్తోందని ,లంచాలు ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేశారు.

అయితే వ్యక్తిగత పనుల కోసం లంచాలు ఇవ్వడం మామూలే కానీ, ప్రభుత్వ పనుల నిమిత్తం లంచాలు ఇస్తున్నారు అంటూ సరికొత్త వాదనను రాధాకృష్ణ తన పలుకుల్లో వినిపించారు.ఇంతకీ ఈ లంచాలు ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడానికి ,ప్రభుత్వం తరఫున తగిన సహకారం పొందడానికి కోట్లకొద్దీ సొమ్ములు కేంద్రమంత్రులకు ఇస్తున్నారు అనే ఈ విధంగా ఆ ఆర్టికల్ లో విశ్లేషించారు.

Telugu Abn Rk, Ap Cm Jagan, Jagan, Kittu, Kotta Paluku, Radhakrishna, Ysrcp-Telu

కేవలం మంత్రుల పైనే కాకుండా న్యాయవ్యవస్థను నియంత్రించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రత్యర్థులకు సరైన ఆధారాలు దొరకకుండా, వారి తరఫున వాదించకుండా ఉండేందుకు డబ్బులు ఇస్తున్నట్లు ప్రచారం అవుతోందని ఆర్టికల్ వివరించారు.జగన్ ప్రభుత్వం తీసుకోవడం, ఇవ్వడం అనే విషయంపైనే ముందుకు వెళుతోంది అని, అలాగే జగన్ మీడియా సాక్షి కి పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రకటనలు ఇస్తూ, తమ పత్రికను పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ఆర్కే విశ్లేషించారు.ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆరోపణలు ఈ వారం కొత్త పలుకుల్లో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube